సమంత (Samantha) సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్, అలాగే ఆ మధ్య మయోసైటిస్ వ్యాధితో పాటు కొన్ని ఆరోగ్య, వృత్తిపరమైన సమస్యలు రావడంతో సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వాలనుకున్నారట సామ్. అందుకే తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి అనుకున్నట్టుగానే కొన్నాళ్లు మూవీస్ కు బై చెప్పేసింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలతో పాటు ఆహ్లాదకర ప్రదేశాలను సందర్శిస్తూ చిల్ అవుతోంది. రీసెంట్ గా తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. అక్కడ రోడ్ ట్రిప్ లు చేస్తూ సరదాగా గడుపుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే సమంత టూర్ లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


సమంత కళ్లజోడు ఎత్తుకెళ్లిన కోతి


సమంత ప్రస్తుతం విహార యాత్రల్లో మునిగితేలుతోంది. ఇండోనేషియాలో రోడ్ ట్రిప్ కు వెళ్లిన సమంతకు ఓ సరదా అనుభవం ఎదురైంది. సమంత అక్కడ ఉన్న ఆహ్లాదకర ప్రదేశాల దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులిస్తోంది. అయితే ఇంతలో ఓ కోతి వెనక వైపు నుంచి వచ్చి సమంత కళ్లజోడును ఎత్తుకెళ్లపోయింది. తర్వాత ఓ వ్యక్తి వెళ్లి దాన్ని బుజ్జగించి ఆ కళ్లజోడు తీసుకుందామని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అలా సమంత కళ్లజోడును ఓ కోతి లాక్కెళ్ళిపోయింది. అయితే... అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంతే కాదు కోతి కళ్లజోడు ఎత్తుకెళ్లిపోయిన వీడియోకు ‘‘నిజంగా ఆ కోతికి మంచి టేస్ట్ ఉంది’’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. వీటితో పాటు ఆ ట్రిప్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది సమంత. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 


సమంత త్వరలో అమెరికా వెళ్లనుందా?


సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సుధీర్ఘకాలం పాటు దానికి ట్రీట్మెంట్ తీసుకుంది. అయినా ఇప్పటికీ తనను ఆ వ్యాధి వేధిస్తోందట. అందుకే దీనిపై పూర్తి శ్రద్ధ పెట్టి పూర్తిగా కోలుకోవాలని భావిస్తోందట సామ్. అందుకే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేసింది. ముందుగా తీసుకున్న అడ్వాన్సులన్నీ వెనక్కి తిరిగిచ్చేసిందని టాక్. ఇకపై తన ఆరోగ్యం పై పూర్తిగా కేర్ తీసుకోవాలని చూస్తుందట. ఇందులో భాగంగానే మయోసైటిస్ కు మెరుగైన చికిత్స కోసం సమంత త్వరలో అమెరికా వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే సమంత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుంది అనే విషయం చెప్పలేదు సమంత. సమంత సినిమాల్లో లేకపోయినా ఇలా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు విశేషాలను తెలియజేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది సమంత.


Also Read: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాలో ఆ మాస్ బీట్ సాంగ్ - ఇక థియేటర్లలో రచ్చ రచ్చే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial