High Security To War 2 Pre Release Event: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీపైనే ప్రస్తుతం అందరి చూపు ఉంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా మూవీ టీం భారీ ఏర్పాట్లు చేసింది. ఒకే వేదికపై ఎన్టీఆర్, హృతిక్ కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంత మంది పోలీసులా?
సాధారణంగా ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే పోలీస్ సెక్యూరిటీ ఉండడం కామన్. అదే స్టార్ హీరో అయితే కాస్త ఎక్కువ సెక్యూరిటీ ఎరేంజ్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ మూవీ కోసం దాదాపు 1200 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ ఈ ఈవెంట్ జరగనుండగా... ఫుల్ సెక్యూరిటీతో టీం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. 'హిస్టరీ ఈజ్ మేకింగ్. ఎన్టీఆర్ ఫ్యామిలీ భద్రతకు 1200 మందికి పైగా పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. తొలిసారిగా ఇంత స్థాయి భద్రతతో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం.' అంటూ రాసుకొచ్చారు. గ్రౌండ్ వద్ద భారీగా పోలీసులు ఉన్న వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఈవెంటా? లేక పీఎం ప్రొటక్షనా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఎన్టీఆర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుందని... దటీజ్ ఎన్టీఆర్ అంటూ పేర్కొంటున్నారు.
Also Read: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మెగా హీరోలు - ఫోటోనే కాదు మూవీస్ కూడా ట్రెండింగే
ఒకే వేదికపై...
ఈ నెల 14న మూవీ రిలీజ్ కానుండగా... ఇప్పటివరకూ ఎన్టీఆర్, హృతిక్ కలిసి ప్రమోషనల్ ఈవెంట్స్ చేసింది లేదు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, హృతిక్ వేర్వేరుగా ప్రమోషన్స్ చేస్తారని ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే, హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ టైం ఇద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ఎవరు వచ్చినా రాకపోయినా... ఈవెంట్‌కు ఎన్టీఆర్, హృతిక్ సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పాస్ ఉన్న వారికే ఈవెంట్‌కు అనుమతి ఇస్తారు. ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది మూవీ టీం. ప్రస్తుతం నగరంలో వర్షాలు కురుస్తుండడంతో భారీ వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేజీపై రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. వేదిక ముందు కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్స్ వేశారు. ఫ్యాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఇది ఫస్ట్ బాలీవుడ్ మూవీ కాగా భారీ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.