టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ ను పట్టాలెక్కించనున్నారు. అలానే చిరు లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో చిరు చేయబోయేది మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కన్ఫామ్ చేశారు. చిరు సినిమా ఎలా ఉండబోతుంది..? సినిమా నేపథ్యం ఏంటనే విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఇదొక స్టార్‌కి, ఓ అభిమానికి మధ్య జరిగే కథ అని చెప్పారు. ఈ స్టోరీ లైన్ వింటుంటే మలయాళ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' గుర్తొస్తుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో పృథ్వీ రాజ్ స్టార్ హీరో పాత్ర పోషించగా.. ఆయన్ని ఆరాధించే అభిమానిగా నటుడు సూరజ్ ఆర్టీవో ఆఫీసర్ పాత్రలో కనిపించారు.
Also Read : RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు
కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో రివెంజ్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ కథనే బాబీ తీస్తున్నాడనిపిస్తుంది. ఇంతకముందు రామ్ చరణ్‌కి 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా నచ్చిందని.. ఆయన రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవిలతో రామ్ చరణ్ ఈ సినిమా చేయాలనుకున్నట్లు ప్రచారం సాగింది. ఆ సంగతులు పక్కన పెడితే.. ఇప్పుడు చిరంజీవితో బాబీ చేయబోయే సినిమా ఇదే కాన్సెప్ట్ తో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. మరి ఈ సంస్థ రీమేక్ హక్కులను తీసుకుందో లేక.. బాబీ 'డ్రైవింగ్ లైసెన్స్' స్పూర్తితో కథను రాసుకున్నారో తెలియాల్సివుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే విషయంలో చిరు తన ఆలోచనలు మార్చుకున్నట్లు సమాచారం. నిజానికి 'లూసిఫర్' రీమేక్ తరువాత బాబీ సినిమా మొదలుపెట్టాలి. సెప్టెంబర్ నుండి తన సినిమా షూటింగ్ ఉంటుందని బాబీ చెబుతున్నారు కానీ 'లూసిఫర్' రీమేక్ పూర్తయ్యే వరకు మెగాస్టార్ మరో సినిమా మొదలుపెట్టరని తెలుస్తోంది.
'లూసిఫర్' రీమేక్ తరువాత 'వేదాళం' రీమేక్‌ను ముందుగా మొదలుపెడతారు. అలానే ఓ ఫ్యామిలీ స్టోరీ చేసే ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించే డైరెక్టర్ ఒకరు చెప్పిన లైన్ మెగాస్టార్ చిరుకి నచ్చడంతో ముందుగా ఈ సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నారట. మరి ఈ విషయంలో బాబీ వెనక్కి తగ్గుతారేమో చూడాలి!
Also Read : Sarkaru Vaari Paata First Look: మహేష్ బాబు స్టైలిష్ లుక్.. సూపర్ స్టార్ ఫస్ట్ నోటీస్ ఇంపాక్ట్