Allu Studios: అల్లు స్టూడియోస్ లాంఛింగ్ ఈవెంట్ - గెస్ట్ గా మెగాస్టార్!

అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా.. అల్లు స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు.  

Continues below advertisement

దివంగత అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన గుర్తుగా అల్లు ఫ్యామిలీ ఓ స్టూడియోను నిర్మించింది. గతేడాది అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్ లో కొత్త ఫిలిం స్టూడియోను అల్లు స్టూడియోస్(Allu Studios) పేరుతో మొదలుపెట్టారు. 

Continues below advertisement

Chiranjeevi to inaugurate Allu Studios: స్టూడియోస్ నిర్మాణం పూర్తి కావడంతో అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా.. ఈ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు స్టూడియోస్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మధ్యకాలంలో మెగా, అల్లు ఫ్యామిలీలకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రెండు ఫ్యామిలీలకు పడడం లేదని.. గుసగుసలు వినిపించాయి. 

అందులో నిజం లేదని.. అల్లు ఫ్యామిలీ పరోక్షంగా ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చేతుల మీదుగా లాంచ్ చేస్తూ.. తమ మధ్య ఉన్న బాండింగ్ ను మరోసారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఇక స్టూడియోస్ విషయానికొస్తే.. గండిపేట్‌లో 10 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. అన్ని సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 

ఇక ఈ స్టూడియోస్ లో ముందుగా 'పుష్ప2' షూటింగ్ ను జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా కొన్ని సెట్స్ ను నిర్మించనున్నారు. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరి ఈసారి మారేడుమిల్లి వెళ్తారో లేక ఇతర అడవి లొకేషన్స్ ఏమైనా చూస్తారో తెలియాల్సివుంది. విదేశాల్లో కూడా అటవీ లొకేషన్స్ చూస్తున్నారని టాక్. ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారో చూడాలి! 

ఇక మెగాస్టార్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola