బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). తొలి రెండు రోజుల్లో ఈ సినిమా 69 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా విడుదలైన మూడు, నాలుగో రోజు కూడా సినిమా చూడటానికి జనాలు థియేటర్లకు వచ్చారు. శుక్ర, శనివారాల్లో ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 


'గాడ్ ఫాదర్' @ 100 క్రోర్స్ క్లబ్!
'గాడ్ ఫాదర్' సినిమా నాలుగు రోజుల్లో వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది తెలుగులో భారీ విజయాలు సాధించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే, రీమేక్‌తో నాలుగు రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన ఘనత మెగాస్టార్ ఖాతాలో చేరింది. విజయ దశమి సెలవులు కూడా సినిమాకు హెల్ప్ అయ్యాయి. సల్మాన్ ఖాన్ ఉండటంతో ఉత్తరాదిలో కూడా కొంత హెల్ప్ అయ్యింది.  


వీకెండ్ తర్వాత ఎలా ఉంటుందో?
Litmus Test For Godfather From Monday : 'గాడ్ ఫాదర్' సినిమాకు అసలైన పరీక్ష సోమవారం నుంచి మొదలు కానుంది. దసరా సమయంలో విడుదల కావడం, ఆ తర్వాత పండగ సెలవులు ఉండటంతో మొదటి నాలుగైదు రోజులు సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి. ఈ మధ్య కాలంలో హిట్ టాక్ వచ్చిన కొన్ని సినిమాలు వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ బరిలో చతికిలపడ్డాయి. 'గాడ్ ఫాదర్' ఆ జాబితాలో చేరుతుందో? లేదంటే వసూళ్ల జైత్రయాత్ర కొనసాగిస్తుందో చూడాలి.


Also Read :  Chiranjeevi Emotional Speech At Godfather Success Meet : 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?



'గాడ్ ఫాదర్' (Godfather Movie Response)కు మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా అభిమానులు థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. తెలుగులో రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర మెగా హడావిడి కనిపించింది. దసరాకు విడుదలైన మరో రెండు సినిమాల కంటే ఈ సినిమా బావుందని టాక్ రావడం మరింత హెల్ప్ అయ్యింది.  


హిందీలో 600 స్క్రీన్లు ఎక్స్ట్రా!
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... హిందీలో కూడా 'గాడ్ ఫాదర్'కు మంచి ఆదరణ లభించింది. ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. శనివారం నుంచి నార్త్ ఇండియాలో 'గాడ్ ఫాదర్'కు 600 స్క్రీన్లు పెరిగాయి. అక్టోబర్ 5న విడుదలైన స్క్రీన్లకు ఇవి అదనం అన్నమాట. 'గాడ్ ఫాదర్' హిందీ వెర్షన్ పది కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే... అంత కంటే ఎక్కువ కలెక్ట్ చేయవచ్చని తెలుస్తోంది. 



మార్పులు మంచి చేశాయి!
మోహన్ లాల్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్'. మలయాళ సినిమాతో పోలిస్తే... తెలుగులో చాలా మార్పులు చేశారు. అందులో తమ్ముడి క్యారెక్టర్ కట్ చేయడం ఒకటి. విలన్ క్యారెక్టర్ సీఎం కుర్చీ మీద మోజు పడటం మరొకటి. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మాసీగా మార్చారు. మోహన్ రాజా చేసిన మార్పులకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మెగాస్టార్ నుంచి మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో... ఆయా అంశాలతో కొత్తగా సినిమా తీశారని దర్శకుడిని చాలా మంది మెచ్చుకుంటున్నారు.


Also Read :  Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్