అనికా సురేంద్రన్.. తమిళ టాప్ హీరో అజిత్ కుమార్ నటించిన సినిమాల్లో బాల నటిగా మెప్పించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోయింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా తన సత్తా చాటబోతోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే టైటిల్‌తో వస్తోంది. ఈ నేపథ్యంలో ‘బుట్టబొమ్మ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మాయికి తగినట్లే సినిమా టైటిల్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న అమ్మాయి అనికా.. ఈ సినిమాతో పెద్ద హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. ఇక హీరోయిన్ గా తొలి సినిమా తోనే సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు దక్కింది. టాలీవుడ్ లో అద్భుత సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ అమ్మాయికి సైతం మంచి పేరు తెచ్చి పెడుతుందనే టాక్ నడుస్తున్నది. ప్రముఖ బ్యానర్ లో వస్తున్న సినిమా కావడంతో అటు ప్రేక్షకులు సైతం భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత అనికాకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
బుట్టబొమ్మ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫొర్టీన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నది. శౌరి చంద్రశేఖర్ తో పాటు టి రమేష్ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. బుట్టబొమ్మ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసి నెటిజన్లతో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం అభినందనలు తెలుపుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టాలో ‘బుట్టబొమ్మ’ ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేశారు. “ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న శౌరి చంద్రశేఖర్ కు ఆల్ ది వెరీ బెస్ట్. ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించి మీ అంకితభావం, ప్రశాంతమైన తీరు, అపారమైన జ్ఞానం మాకు నిజంగా స్ఫూర్తినిస్తున్నాయి. బుట్టబొమ్మ నటీనటులకు, సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు” అని సుకుమార్ తెలిపారు.
Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ