Brahmastra Song Teaser: రణబీర్-అలియా న్యూ జర్నీ, 'బ్రహ్మాస్త' టీమ్ స్పెషల్ విషెస్ 

అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' టీమ్ స్పెషల్ గా విష్ చేసింది.

Continues below advertisement

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం బీటౌన్ మొత్తం రణబీర్, అలియాభట్ ల పెళ్లి గురించే చర్చించుకుంటోంది. ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. కొందరు మాత్రం ఏప్రిల్ 15న పెళ్లి జరగబోతుందని అంటున్నారు. 

Continues below advertisement

ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' టీమ్ స్పెషల్ గా విష్ చేసింది. ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ.. రణబీర్, అలియాలకు శుభాకాంక్షలు చెప్పారు. వారణాసిలో చిత్రీకరించిన 'కేసరియా' అనే మొదటి పాటకు సంబంధించిన చిన్న టీజర్ ను దర్శకుడు అయాన్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 

'రానున్న రోజుల్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఈషా, శివల జీవితాల్లో ప్రేమ, అదృష్టం, వెలుగులు నిండాలని కోరుకుంటూ టీమ్ బ్రహ్మాస్త్ర నుంచి ఈ విషెస్' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అలానే దర్శకుడు అయాన్.. అలియా, రణబీర్ లతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు

Continues below advertisement
Sponsored Links by Taboola