'బ్రహ్మాస్త్ర' (Brahmastra Movie) సినిమాపై హిందీ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటించిన 'భూల్ భులయ్యా 2' తర్వాత మరో భారీ విజయం లేదు. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలు సాధించలేదు. బాయ్ కాట్ ట్రెండ్ కూడా అందుకు కారణం అని కొందరు కామెంట్ చేశారు. 'బ్రహ్మాస్త్ర'ను సైతం బాయ్ కాట్ చేయమని కొందరు పిలుపు ఇచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే... బాయ్ కాట్ ఎఫెక్ట్ పెద్దగా లేదని తెలుస్తోంది. అందుకని, బాలీవుడ్ వరుస ఫ్లాపులకు 'బ్రహ్మాస్త్ర' బ్రేక్ వేస్తుందని ముంబై సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు. వాళ్ళకు షాక్ ఇస్తూ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చింది. 


'బ్రహ్మాస్త్ర'కు జస్ట్ 2.5 రేటింగేనా?
Brahmastra First Review Rating : దుబాయ్ నుంచి ఉమైర్ సంధు ప్రతి సినిమా విడుదలకు ముందు ట్వీట్ రివ్యూ, రేటింగ్ ఇస్తుంటారు. దుబాయ్‌లో సెన్సార్ జరిగేటప్పుడు తాను సినిమా చూస్తానని ఆయన చెబుతుంటారు. లేటెస్టుగా ఆయన 'బ్రహ్మాస్త్ర' చూశానని తెలిపారు. ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన సినిమాకు కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, కొన్ని సీక్వెన్సులు బావున్నాయని ఉమైర్ సందు పేర్కొన్నారు.






'బ్రహ్మాస్త్ర' బావుంటుందని ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు, హిందీ చలన చిత్ర ప్రముఖులకు ఉమైర్ సంధు రివ్యూ షాక్ ఇచ్చింది. అయితే... ప్రతిసారీ ఆయన కరెక్ట్ రివ్యూ ఇస్తారని చెప్పలేం. కొన్నిసార్లు ఆయన చెప్పింది తప్పని రుజువు చేస్తూ విజయం సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. సో... 'బ్రహ్మస్త్ర' కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. 


'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలతో సినిమా రూపొందించినట్లు హిందీ ఇండస్ట్రీ టాక్. థియేటర్లలో అంత వస్తుందా? రాదా? అనేది చూడాలి. ఇటీవల విడుదలైన హిందీ సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే... అంత రాబట్టడం కష్టమే. కానీ, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈజీ అనిపిస్తోంది. 



Also Read : 'కెప్టెన్' టు 'బ్రహ్మాస్త్ర' - థియేటర్లలో విడుదలయ్యే ఎనిమిది సినిమాల్లో మీ ఓటు దేనికి?



Brahmastra Advance Booking : 'బ్రహ్మస్త్ర'కు నార్త్ ఇండియాలో మాత్రమే కాదు... సౌత్ ఇండియన్ సిటీస్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా బుకింగ్స్ బావున్నాయి. ఒక్క పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో లక్ష టికెట్లు తెగాయి. రిలీజ్ డే హిట్ టాక్ వస్తే బడ్జెట్ రికవరీ చేయడం, లాభాలు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. 


Also Read : కొరియన్‌లో 'ఆర్ఆర్ఆర్' రీమేక్ - ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసిన సునీత తాటి