Tirumala Disuptes :  తిరుమల తిరుపతి దేవస్థానం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. దాదాపుగా ప్రతీ రోజూ ఖండన ప్రకటనలు చేస్తూనే ఉంది.  టీటీడీపై తప్పుడు ప్రచారం జరుగుతందని ఆరోపిస్తూనే ఉంది. కానీ జరగాల్సిన ప్రచారం మాత్రం దరిగిపతోంది. శివాజీ విగ్రహం దగ్గర్నుంచి నటి అర్చగా గౌతం వ్యవహారం వరకూ చాలా వివాదాలు  చోటు చేసుకున్నాయి. అన్ని చోట్లా జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత టీటీడీ ఖండన ప్రకటనలు చేస్తోంది. 
  
శివాజీ బొమ్మ వివాదంతో  టీటీడీకి ఇబ్బందులు ! 


కొద్ది రోజుల కిందట మహారాష్ట్ర నుంచి ఓ భక్తుడు తిరుమలకు వెళ్లేందుకు అలిపిరికి వచ్చాడు. ఆయన కారులో శివాజీ విగ్రహం ఉంది. దాన్ని తీసేయాల్సిందేనని సిబ్బందిప పట్టుబట్టారు. ఇటీవల టీటీడీ అన్యమత స్టికర్లను కూడా అంగీకరించడం లేదు. ఈ కారణంగా శివాజీ హిందువు కాదని అనుకున్నారేమో కానీ టీటీడీ సిబ్బంది శివాజీ బొమ్మను తొలగించకపోతే కొండపైకి అనుమతించే ప్రసక్తే లేదన్నారు.  శివాజీని పవిత్రంగా భావించే ఆ మహారాష్ట్ర భక్తుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే మహారాష్ట్ర మొత్తం భగ్గుమంది. టీటీడీ కవర్ చేసుకోవడానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరికి మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో టీటీడీ శివాజీని బాగా గౌరవిస్తుందని సర్టిఫికెట్‌లాంటి మాటలు చెప్పించుకోవాల్సి వచ్చింది. 


అర్చనా గౌతం వ్యవహారంలోనూ అదే సీన్ ! 


నటి అర్చనా గౌతం వ్యవహార కూడా అంతే ఉంది. టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించలేదని. .ఆమెనే దూకుడుగా వ్యవహరించారని టీటీడీ వర్గాలు చెబుతున్నారు. అయితే రెండు వైపులా వీడియోలు  బయట పెట్టుకున్నారు. చివరికి టీటీడీ అదంతా అబద్దమని.. వాదించడానికి ఓ రోజంతా యంత్రాంగాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అదే సమయంలో రాధామనోహర్ దాస్ అనే స్వామిజీ టీటీడీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసే విమర్శలు నిజం కాదని చెప్పలేక.. ఆయనపై కేసులేస్తామని టీటీడీ వాదిస్తోంది. ఇక హనుమాన్ జన్మస్థలం విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కిష్కింధ ట్రస్ట్ గోవిందానంద సరస్వతి.. టీటీడీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలుచేస్తున్నారు. 


ఆరోపణలు చేస్తే చక చకా కేసులు పెడుతునన టీటీడీ ! 


బయట రాష్ట్రలా వారే కాదు..  స్వరాష్ట్రానికిచెందిన భక్తులు కూడా ఆరోమలు చేస్తున్నారు. ఇటీవల తాను గది కోసం కట్టిన కాషన్ డిపాజిట్ తిరిగివ్వడం లేదని... ఆరోపించినందుకు టీడీపీ నేత బీటెక్ రవిపై అప్పటికప్పుడు కేసు పెట్టారు. నిజానికి ఆ రీఫండ్ తిరిగి ఇవ్వడం లేదని ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై టీటీడీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదంతా దుష్ప్రచారం అని ఓ ఖండన మాత్రం విడుదలవుతోంది. 


కొండను సొంత ఆస్తిలా భావిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నతేలు 


ఇక వైసీపీ నేతలు కొండ మీద చేసే దర్శనాలు... అది వారి సొంతమేమో అన్నట్లుగా మారిపోయింది. వందల మందితో దూసుకెళ్లిపోతున్నారు. వారికి అడ్డే ఉండటం లేదు. మళ్లీ గుడి ముందే రాజకీయాలతో  విపక్ష నేతలపై దారుణమైన భాష వాడుతున్నారు. పవిత్రంగా ఉంచాల్సిన టీటీడీ పరిపాలన ఇలా కావడం భక్తుల్ని అసహనానికి గురి చేస్తోంది. ఇలా వరుసగా టీటీడీ వివాదాల్లో కూరుకుపోతోంది. ఒకటి, రెండు సార్లు అయితే ఏదో పొరపాటున  జరిగిందనుకోవచ్చు కానీ.. ఇలా వరుసగా వివాదాలు చోటు చేసుకుంటే తప్పిదం మాత్రం టీటీడీలోనే ఉందని ఎక్కువ మంది భావిస్తారు