శనివారం ఉదయం కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బ్రహ్మానందం ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను గీసిన శిరిడి సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ సర్‌ప్రైజ్ పట్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఫొటోలు షేర్ చేశారు. ‘‘మన కామెడీ జీనియస్.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్ ది స్పెషల్ సర్‌ప్రైజ్’’అని ట్వీట్ చేశారు.
బ్రహ్మానందం బొమ్మ గీసి ఇవ్వడం ఇదే మొదలు కాదు.. గతంలోనూ పలువురి హీరోలకు తాను స్వయంగా గీసిన చిత్రపటాలు బహూకరించారు. వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ వేసి చిరంజీవి, రానా, అల్లు అర్జున్ కి అందించారు. ఖాళీ సమయం దొరికితే చాలు పెయింటింగ్ పై కాన్సన్ ట్రేట్ చేస్తుంటారు బ్రహ్మానందం.