నిశ్చితార్థానికి వియ్యపురాలు కనకం వాళ్ళని పిలుస్తానని రుద్రాణి చెప్తుంది. కావాలంటే నువ్వు చేసుకునే ఫంక్షన్ కి వాళ్ళని పిలవకు నా కొడుకు ఫంక్షన్ కి పిలవోద్దు అంటే ఎలా? మొదటి నుంచి నా కొడుక్కి రిచ్ సంబంధం చేయడం ఇష్టం లేదని అందుకే ఇలా చేస్తున్నావని అపర్ణని మాటలు అంటుంది. కావాలని అపర్ణ ముందే కనకానికి ఫోన్ చేసి తన కొడుకు నిశ్చితార్థానికి రమ్మని పిలుస్తుంది. స్వప్న నిశ్చితార్థం కూడా రేపే పెట్టుకున్నాం కదా అని మనసులో అనుకుని ఇంట్లో పూజ పెట్టుకున్నాం రాలేమని అబద్ధం చెప్తుంది. రాహుల్ ఒక రోమియో అనుకున్నా కానీ మరీ ఇంత బ్యాడ్ తనది ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదని కావ్య అంటుంది. తనకి కూడా షాకింగ్ గా ఉందని కళ్యాణ్ అంటాడు. ఇలాంటి వాడికి అక్కని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదంటుంది. ఇప్పుడు రాహుల్ నిజస్వరూపం స్వప్నకి, రాజ్ కి తెలియడం కాదు కుంభస్థలం బద్ధలు కొడదామని చెప్తుంది.


అందరూ కూర్చుని పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన నగలు చీరలు ముందు వేసుకుని చూస్తూ ఉంటారు. నీ కొడుకు పెళ్లి ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయితో జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నా కొడుకు పెళ్లితో పోయిన దుగ్గిరాల ఇంటి పరువు తిరిగి నిలబెడతానని రుద్రాణి అంటుంది.


Also Read: వావ్ వాట్ ఏ సీన్.. రుద్రాణిని వాయించేసిన కావ్య, సపోర్ట్ చేసిన అపర్ణ- శృతికి హ్యాండ్ ఇచ్చిన రాహుల్


కావ్య: మీరు ఎవరిని ఏం అంటున్నారో తెలుసుకోవచ్చా?


రుద్రాణి: నిన్ను చేసుకోవడం వల్ల మీ అత్తకి, మీ ఆయనకి పరువు పోయింది


కావ్య: నన్ను ఎలా చేసుకున్నారో మర్చిపోయారా? మా అక్క వెళ్లిపోతే నన్ను తొందరపెట్టింది మీరు నా నెత్తిన ముసుగు వేసి పీటల మీద కూర్చోబెట్టింది మీరు. అంటే మాయన పరువు అత్త పరువు తీసింది మీరే కదా? మీరేగా నన్ను బలవంతంగా అంట గట్టింది ఇప్పుడు మా వాళ్ళని హేళన చేస్తున్నారు ఏంటి? మీకు ఎక్స్ క్లూజివ్ నగలు కావాలి మీ రిచ్ క్లాస్ కోడలికి పెట్టడానికి కానీ అవి తయారు చేయించింది మా ఆయన మీ కొడుకు కాదు అది గుర్తు పెట్టుకో


రుద్రాణి: నిన్న గాక మొన్న మా ఇంటికి వచ్చి నన్ను అన్ని మాటలు అంటావా? నేను ఈ ఇంటి ఆడపడుచుని


కావ్య: ఆడపడుచు అంటే పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలి


రుద్రాణి: నాకే నీతులు చెప్తావా నువ్వు ఎంత నీ బతుకు ఎంత అని కావ్యని కొట్టబోతుంటే అపర్ణ ఆపుతుంది


అపర్ణ: ఎవరి మీద చెయ్యి ఎత్తుతున్నావ్ దించు. ఇది దుగ్గిరాల కుటుంబం ఈ ఇంటి కోడలి మీద చెయ్యి ఎత్తుతావా?


రుద్రాణి: ఓహో అప్పుడే మీరు అంతా ఒక్కటయ్యారా. నా కొడుకు రిచ్ సంబంధం వస్తే అందరూ అసూయ పడుతున్నారా?


కావ్య: అసూయపరులే అయితే ఈ సంబంధం చెడగొట్టడానికి మా అత్తకి ఒక్క క్షణం పట్టదు. ఆ అరుంధతి మా అత్త స్నేహితురాలనే విషయం మర్చిపోయారా? అసలు మా అత్త తలుచుకుంటే మీ ముగ్గురు ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండగలరా? బంధాలకి విలువ ఇచ్చే కుటుంబం కాబట్టి ఇన్ని మాటలు అంటున్నా పడుతున్నారు. ఇంకొకసారి మా అత్తని, భర్తని ఒక్క మాట అన్నా ఊరుకొను. వాళ్ళ సంస్కారం ఏం మాట్లాడకపోవచ్చు. కానీ నేను సంస్కారం వదులుకోవడానికి ఏ మాత్రం ఆలోచించను


Also Read: పెళ్లి చేసుకొచ్చిన అభిమన్యు, మాళవిక షాక్ - హనీమూన్ కి చెక్కేసిన వసంత్ దంపతులు


అపర్ణ: కావ్యని ఆగమని అక్కడ ఉన్న చీర, నగలు తీసి రాజ్ కి ఇచ్చి మన ఇంటి కోడలికి మన స్థాయికి తగ్గట్టు అర్హత ఉండాలి కదా ఇవి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తుంది. రాజ్ వాటిని ఇస్తుంటే కావ్య ఆశ్చర్యపోతుంది. ఎందుకు మనవరాలా ఆశ్చర్యపోతున్నావ్ నువ్వు ఈ ఇంటి కోడలివి అని మీ అత్త చెప్పకనే చెప్పిందని అంటుంది. గదిలో వాటిని చూసుకుంటూ మురిసిపోతుంటే అపర్ణ వచ్చి మాటలు అంటుంది. ఏంటి సంబరపడుతున్నావా? నేను ఈ చీర నగలు ఇచ్చింది మాకు సపోర్ట్ చేసినందుకు కాదు ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వు అతిథివి. నా ఫ్రెండ్ నిన్ను పనిమనిషి అనుకుంది. రేపు అందరూ నిన్ను నా కోడలు అనే అనుకుంటారు. రేపు మా స్థాయికి తగినట్టు కనిపించాలని వాటిని ఇప్పించాను. రుద్రాణి ఏదో అన్నంత మాత్రణ నెత్తిన పెట్టుకునే వాళ్ళు లేరని అనేసరికి కావ్య బాధపడుతుంది. రాజ్ వచ్చి మా అమ్మ అభిప్రాయం నాది ఒకటే నీకు ఇచ్చిన గడువు ముగిసేలోగా నాకు జరిగిన అన్యాయంలో నీ తప్పు లేదని నిరూపించుకుంటేనే ఈ ఇంట్లో స్థానమని అంటాడు. ఎప్పటికైనా నిజం నిలబడుతుంది అప్పుడు మీరు మీ అమ్మ నన్ను అతిథిలా కాకుండా ఇంటి సభ్యురాలిగా చూస్తారని చెప్తుంది.