కనకాన్ని పోలీసులకి పట్టిస్తానని రాజ్ ఫోన్ చేస్తుంటే చెయ్యండి వాళ్ళు వచ్చి అసలు నేరస్థులని పట్టుకోవాలి. ‘మా అమ్మ మీ అమ్మ కాళ్ళు పట్టుకోవడం చూసి కూడా మా తప్పు లేదని ఇందులో తన ప్రేమయం ఉందని చెప్పకుండా చూస్తూ నిలబడితే తప్పు మా మీద ఎందుకు వేసుకోవాలి. ఆ తప్పు చేయడం తప్పనిసరి అంటూ మమ్మల్ని బలవంతం చేసి బెదిరించి ముసుగు వేయించి ఇప్పుడు మంచితనం ముసుగులో ఉన్న మనిషి గురించి చెప్తాను పోలీసులని వెంటనే పిలిపించండి అని కావ్య అనడంతో రుద్రాణి వణికిపోతుంది. స్వప్న రాహుల్ ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంది. నిజం తెలిసి రాహుల్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, ఇప్పుడు ఉంచుకున్నది పోయింది ఉన్నది పోయిందన్నట్టు పరిస్థితి అయ్యింది ఏం చేయాలని టెన్షన్ పడుతూ ఉంటే రాహుల్ వస్తాడు.


ఏంటి ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యవు ఏమైందోనని ఎంత టెన్షన్ పడ్డానో అని స్వప్న నిలదీస్తుంది. ఆఫీసు పనిలో బిజీగా ఉన్నానని అబద్ధాలు చెప్తాడు. పెళ్లి అయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలి కదా అని రాహుల్ అనేసరికి ఇంకా నిజం తెలియలేదని స్వప్న మనసులో అనుకుంటుంది. వెంటనే పెళ్లి చేసుకుందామని స్వప్న అడిగేసరికి రాహుల్ చిరాకు పడతాడు. వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని గోల చేస్తావ్ ఏంటని అరుస్తాడు. దీంతో సోరి చెప్తుంది. ఇక సీన్ మళ్ళీ రాజ్ ఇంట్లో కనిపిస్తుంది. ఇంటి గుట్టు నువ్వే బయట పెడతావా అని కనకం వద్దని ఆపుతుంది. ఎవరు మీకు సపోర్ట్ చేసి సహాయం చేసిందని అపర్ణ కావ్యని ప్రశ్నిస్తుంది. నేరానికి శిక్ష పడాలని అన్నారు కదా అప్పుడే అమాయకులు కాళ్ళ వెళ్ళా పడాల్సిన అవసరం లేదని కావ్య అంటుంది.


Also Read: రామకి నిజం చెప్పిన జానకి- కోడలి క్షమాపణలు అంగీకరించని జ్ఞానంబ


మా అక్క పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోయాక ఈ విషయం ఎవరికి చెప్పలేక మా అమ్మ ఉరేసుకోబోయింది. సమయానికి నేను చూశాను కాబట్టి నేను కాపాడుకోగలిగాను. ఏం చేయాలో తెలియక మాట్లాడుకుంటున్నాం. అక్కకి బదులుగా నన్ను పెళ్లి పీటల మీద కూర్చో బెట్టాలనే ఆలోచన ఇంకోకరిది. అది ఎవరో కాదు ఈ రుద్రాణి అనేసరికి అందరూ షాక్ అవుతారు. మీ అమ్మలా కొత్త డ్రామా మొదలుపెట్టావా, నా ఇంట్లో మనుషుల మీద నింద వేసి తప్పించుకోవాలని అనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి పెళ్లి కూతురు కోసం రుద్రాణి వెళ్ళింది, ఆ తర్వాత పెళ్లి కూతురికి ముసుగు వేసి తీసుకొచ్చారు అంటే అప్పుడే స్వప్న వెళ్లిపోయిందని రుద్రానికి తెలుసని అంటుంది. ఈ అమ్మాయి చెప్పేది నిజమా? వాళ్ళకి ఇలాంటి ఆలోచన కలిగించింది నువ్వేనా అని అపర్ణ రుద్రాణిని ప్రశ్నిస్తుంది. వీళ్ళకి ఆ ఆలోచన వచ్చేలా నువ్వే చేసి ఉంటావ్ అని ఇంద్రాదేవి కూడా నిలదీస్తుంది.


ఇంతమంది ఈ ఇంటి ఆడపడుచుని నిలదీస్తున్నారు. ఇంటి పరువు నిలబెట్టడం కోసం ఆ పని చేయమని చెప్పింది నేనే అని రుద్రాణి నిజం బయటపెడుతుంది. ఇంత దారుణమైన విషయం దాచిపెట్టి ఈ అమ్మాయి బయట పెట్టేవరకు వినోదం చూస్తున్నవా అని అపర్ణ కోపంగా అడుగుతుంది.


రుద్రాణి: ద్రోహం కాదు న్యాయం పెళ్లి పీటల మీద నుంచి స్వప్న వెళ్లిపోయిందంటే లేచిపోయిందని అనుకుంటారు. అందుకే ముహూర్తం లోపు స్వప్నని తీసుకురమ్మని వీళ్ళ చిన్నమ్మాయిని పంపించాను. అందుకే ముసుగు వేసి తీసుకొచ్చాను ఆ తర్వాత ఈ అమ్మాయి నిజస్వరూపం బయటపడింది. ఇదేదో మోసం ద్రోహం అన్నట్టు నిలదీస్తారు ఏంటి?


అపర్ణ:  నోర్ముయ్ మాతో ఉంటూ ఇంత ద్రోహం తలపెడతావా


Also Read: విక్రమ్ ని చూసి ఇంప్రెస్ అయిపోయిన దివ్య- గుడిలో రాజ్యలక్ష్మి పరువు తీసిన తులసి


నేను వచ్చి ఇంట్లో గోడవపెట్టి అయ్యింది వెళ్తానని కనకం చెప్తుంది. మంచిది ఇంకెప్పుడు ఈ ఇంటికి రావొద్దని కావ్య సీరియస్ గా అంటుంది. అలాగే నువ్వైనా అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తావ్ కదా అని తల్లి అడిగితే రానని కావ్య చెప్తుంది. ఎందుకని కనకం కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మీ అమ్మాయి ఈ ఇంట్లో ఉండాలంటే పుట్టింటితో సంబంధం ఉండకూడదని నిబంధన ఉందని ధాన్యలక్ష్మి చెప్తుంది. మేము రాకపోతే ఈ ఇంట్లో స్థానం దక్కుతుందని అంటే చచ్చేదాక రానని ఏడుస్తుంది. మీ నాన్నకి ఎలాగోకలా బతికేస్తాం ఇన్నాళ్ళూ మాకోసం కష్టపడ్డావ్ ఇక నీ కాపురం చక్కదిద్దుకోవడానికి కష్టపడమని చెప్తుంది. కావ్య తల్లికి ధైర్యం చెప్తుంది. ఇక్కడజరిగినవి తండ్రితో కానీ అప్పుతో చెప్పొద్దని అంటుంది. ఇక్కడ సంతోషంగానే ఉన్నానని అంటుంది.