మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి మానసిక ఆందోళన తప్పదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టలేరు. ఎన్నో కొత్త ఆలోచనలు మీ మనసులో పరిగెడుతూనే ఉంటాయి. ఆదాయ మార్గాల బలోపేతానికి కృషి చేస్తారు. పిల్లలకు సంబంధించిన అవసరాలు తీర్చడంలో సక్సెస్ అవుతారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. దాంపత్య జీవితంలో ఉండే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితం గడిపేవారికి ఈ రోజు అంత మంచిది కాదు..వారు కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభదినం
మిథున రాశి
ఈ రోజు కుటుంబ స్థాయిలో ఆనందం పెరుగుతుంది.. కానీ చిన్న విషయాలకు కోపం వచ్చే అలవాటు మీ ఆనందాన్ని పాడు చేస్తుంది. ఈ రోజు కోపానికి దూరంగా ఉండడమే మంచిది. కొత్త వ్యక్తులను కలుస్తారు. రోజంతా సరదాగా గడుపుతారు
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆదాయం బాగుంటుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది, ఇది మీ కొత్త బాధ్యతలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.
Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!
సింహ రాశి
సింహ రాశివారికి ఈ రోజు మంచిరోజు. ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మీరు పని పరంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. కొందరికి బదిలీ జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు
తులా రాశి
ఈ రోజు ఎవరి సహాయానికి దూరంగా ఉండండం మంచిది. పరిశోధనలలో పాల్గొనేవారు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వీయ నియంత్రణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. మాటలో ఆచరణాత్మకత, మొండితనం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది కానీ కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో ఒకరిపై ఒకరు అపనమ్మకం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనస్సు రాశివారి ఆలోచన దైవారాధనపై ఉంటుంది. కుటుంబంతో కలసి ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై దృష్టిసారిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది.
మకర రాశి
ఈ రోజు మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సహనంగా వ్యవహరించండ మంచిది. ప్రేమికులకు, వివాహితులకు ఈ రోజు అంత మంచి ఫలితాలు లేవు. ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది
కుంభ రాశి
ఈ రోజు మీరు కొన్ని మంచి ఫలితాలను పొందుతారు..కొన్ని సందర్భాల్లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మీన రాశి
ఈ రోజు మీరు కష్టపడి పనిచేయడం వల్ల ధనాన్ని పొందుతారు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి పట్ల మీ అభిప్రాయాన్ని మీకే పరిమితం చేయండి. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల సంతోషంగా ఉంటారు.