దుగ్గిరాల ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. స్వప్న, రాహుల్ దగ్గర కూర్చుని మెహందీ పెట్టమని అడుగుతుంది. అందరూ తలా ఒక దిక్కున ఉండటం చూసి కళ్యాణ్ ఇది మెహందీ ఫంక్షనా ఆనందంగా జరుపుకోవాలి. ఆడవాళ్ళు ఒక చేతికి మెహందీ పెట్టుకుంటే ఇంకొక చేతికి భర్త తన పేరు రాయాలని కళ్యాణ్ అంటాడు. అందరి పేర్లు చిన్నగా ఉంటే మరి మాయన పేరు  ఏమో చాంతాడంత ఉంటుందని ఇంద్రాదేవి అనేసరికి నేను రాస్తాను కదా సీతారామయ్య వస్తాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. పెళ్లై ఇంతమంది పుట్టినా కూడా తన భర్త చూపించే ప్రేమలో మార్పు లేదని చెప్తూ సంబరపడుతుంది. ఇక అందరూ భర్తలు తమ భార్యాలకు చేతి మీద పేరు రాస్తుంటే కావ్య మాత్రం ఒంటరిగా కూర్చుంటుంది.


Also Read: తల్లిగా మారుతున్న వేద- యష్ కి దగ్గరయ్యేందుకు చూస్తున్న మాళవిక


రాహుల్ సైలెంట్ గా కూర్చునే సరికి ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైలెంట్ గా ఉన్నారని కళ్యాణ్ కోన్ తీసుకొచ్చి ఇస్తాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామని చెప్పి ఇలా సింపుల్ గా జరిపిస్తున్నావ్ ఏంటని స్వప్న అంటుంది. పోవే నిన్ను ఎవడు చేసుకుంటాడు ఆ బేరర్ గాడు నీ మొగుడని రాహుల్ మనసులో అనుకుంటాడు. అందరూ పేర్లు రాస్తున్నారు ఆఖరికి మిగిలింది నువ్వు వదిన అని కళ్యాణ్ ఇరికించేస్తాడు. తనకి చాలా పనులున్నాయని చెప్పి రాజ్ కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ ఎన్ని చెప్పినా కూడా కళ్యాణ్ మాత్రం వదలడు. తనకి సిగ్గు అని కవర్ చేస్తే సరే అందరూ అటు వైపు తిరగమని కళ్యాణ్ చెప్తాడు. ఇక చేసేది లేక రాజ్ కావ్య చేతి మీద పేరు రాస్తాడు. ఇప్పటికైనా అర్థం అయ్యిందా మనది దేవుడు చేసిన పెళ్లి అని అంటుంది. కాదు అది బలవంతం మీద జరిగిందని రాజ్ చెప్తాడు. రాజ్ మెహందీ పెట్టడం చూసి అందరూ సంతోషపడతారు. కాసేపు రాజ్ ని ఆట పట్టిస్తారు.


ALso Read: విషమంగా ముకుంద తల్లి ఆరోగ్యం- కృష్ణ కాలికి మెట్టెలు తొడిగిన మురారీ


నేను చాలా అబద్ధాలు ఆడాను ఇలాంటిది కళ్ళారా చూడటం కోసమేనని కనకం ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఆడిన అబద్ధం మొదటి సారి అందంగా కనిపిస్తుందని కృష్ణమూర్తి సంతోషపడతాడు. అందరూ కలిసి రాజ్ ని ఆట పట్టిస్తారు. శుభాష్ తమ్ముడు ప్రకాష్ తో కూర్చుని పెళ్లి కదా తాగాలని అనిపిస్తుందని అంటాడు. జ్యూస్ లో మందు కలుపుకుని అన్నదమ్ములిద్దరూ లాగించేస్తారు. సంగీత్ పెట్టమని అడుగుదామని స్వప్న అంటే రాహుల్ మాత్రం చిరాకు పడతాడు. మందు కలిపిన జ్యూస్ లు అన్నీ ఇంట్లో కిడ్నాప్ చేయడానికి వచ్చిన మైఖేల్ అందరికీ సర్వ్ చేసేందుకు తీసుకొస్తాడు. ఆ జ్యూస్ రాజ్, అపర్ణ తప్ప అందరూ తాగుతారు. ధాన్యలక్ష్మి జ్యూస్ బాగుందని గ్లాసుల మీద గ్లాసులు లాగించేస్తుంది.