Slippers Inside Home: పూర్వకాలంలో చెప్పులు ఇంటి బయటే తీసి లోపలకి వచ్చేవారు. అందరూ చెప్పులు లేకుండానే ఇంటిలో తిరిగేవారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో చెప్పులు వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. కొంతమంది బయటకు వెళ్లేటప్పుడు వేసుకున్న బూట్లు లేదా చెప్పులతోనే ఇంట్లోకి వచ్చేస్తారు. హిందూ సంస్కృతిలో దీనిని అనేక మంది వ్యతిరేకిస్తున్నా.. ఇప్పటికీ కొందరు ఇంట్లో చెప్పులు లేదా బూట్లు ధరించడం గమనించవచ్చు.
1. ఇంటి లోపల చెప్పులు ధరించడం సరికాదా..?
- శని మన పాదాలకు సంబంధించినదని చెబుతారు.
- పాదాలకు ధరించే బూట్లు, చెప్పులు రాహుకేతువులకు చిహ్నాలు.
- ఇంటి మెయిన్ డోర్ వద్ద బూట్లు, చెప్పులు పెట్టకూడదు. ఎందుకంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
- రాహువు, కేతువు వంటి దోష గ్రహాలు కూడా బూట్లు, చెప్పులు ధరించిన వ్యక్తితో ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
- అందుకే ఇంట్లో చెప్పులు ధరించడం నిషిద్ధం. ప్రత్యామ్నాయంగా, మీరు ఇంట్లో సాక్స్ ధరించవచ్చు.
- ఇంట్లో వంటగది, స్టోర్ రూమ్, పూజా గది మొదలైన వాటి ముందు బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల డబ్బు-ధాన్యానికి కొరత ఏర్పడుతుంది.
2. ఇతర నియమాలు
- మీరు బూట్లు, చెప్పులు విడిచేటప్పుడు, వాటిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచకూడదని గుర్తుంచుకోండి.
- మట్టికొట్టుకుపోయిన బూట్లతో ఇంటికి వచ్చి ఉత్తరం దిక్కున వాటిని తీసేస్తే మీ ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీగా మారుతుంది.
- ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మి కూడా అలాంటి ఇంట్లోకి ప్రవేశించదు, ఆ ఇంట్లో ప్రతికూల శక్తి స్థిరపడుతుంది.
- అందువల్ల మీరు మురికి బూట్లు, చెప్పులు ఉత్తర దిశలో ఎప్పుడూ తీసివేయకూడదు. బదులుగా బూట్లు, చెప్పులు దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచవచ్చు.
- చిరిగిన, పాత బూట్లు ధరించడం వల్ల శని అశుభ నీడ మీపై పడి ఇంట్లో దారిద్య్రానికి కారణమవుతుంది.
- శనివారం బూట్లు, చెప్పులు కొనకూడదు. ఎందుకంటే శని వ్యక్తి పాదాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ రోజు బూట్లు, చెప్పులు కొనడం వల్ల ఇంట్లో శని సంబంధిత సమస్యలు రావచ్చు.
- శని అశుభ ప్రభావాలను వదిలించుకోవడానికి, శనివారం నాడు ఆలయం వెలుపల నల్ల రంగు చెప్పులు, బూట్లను వదిలివేసి, వెనుకకు చూడకండా వచ్చేయండి. అలా చేయడం వల్ల శని దోషం నుంచి బయటపడవచ్చని పెద్దలు చెబుతారు.
Also Read : భోజనానికి ముందు ప్లేటు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
అందువల్ల మీరు ఇంటి లోపల ఎప్పుడూ చెప్పులు లేదా బూట్లు ధరించి నడవకూడదు. ఇది మీ జీవితంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.