న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేషనల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ 2023 సంవత్సరానికి క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 320 సీట్లను భర్తీ చేయనున్నారు. కోర్సును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 03 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. 


కోర్సు వివరాలు.. 


* క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ 


మొత్తం ఖాళీలు: 320 సీట్లు


సీట్ల వివరాలు..


⏩ హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్: 216 సీట్లు


శిక్షణ కాలం: సంవత్సరం.


⏩ ఫిజియోథెరపీ టెక్నీషియన్: 60 సీట్లు


శిక్షణ కాలం: సంవత్సరం.


⏩ డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్: 24 సీట్లు


శిక్షణ కాలం: రెండు సంవత్సరాలు.


⏩ రేడియాలజీ టెక్నీషియన్: 20 సీట్లు


శిక్షణ కాలం: రెండు సంవత్సరాలు.


అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 01.08.2023 నాటికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.


ఎంపిక విధానం: ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.07.2023.


Notification 


Website


Also Read:


ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
తెలంగాణలో జూన్ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది,  ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్ లేదా పాత హాల్‌టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. 
ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..