మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాతో ఎందుకు చెప్పాలని అనిపించలేదు. నిన్ను కన్న కూతురిలాగా చూసుకున్నా కదా నా దగ్గర ఎలా దాయాలి అనిపించింది. నువ్వే నా కోడలు అనుకుని నీ మీద ఎన్నో అసలు పెట్టుకున్న నేను ఏమైపోవాలి? నేను నీకు ఏం కానా? మురారీ దగ్గర నటించినట్టే నా దగ్గర కూడా ప్రేమగా ఉన్నట్టు నటించావా? అని రేవతి ఎమోషనల్ అవుతుంది. మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు ఎందుకు నటిస్తున్నారని అడుగుతుంది.
కృష్ణ: అగ్రిమెంట్ తో ఇక్కడికి వచ్చిన మాట నిజమే కానీ ఈ ఇంట్లో మీ అందరితో సహజంగానే ఉన్నాను. ముఖ్యంగా మీతో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేను మీరంటే నాకు ఎంతో ప్రేమ
రేవతి: అగ్రిమెంట్ అయిపోగానే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావా? మాట ఇవ్వు కృష్ణ ఎప్పటికీ నా కొడుకుని వదిలి వెళ్లనని మాట ఇవ్వు ఇదంతా రేవతి కన్న కల. అంటే నేను అడిగేశానని భ్రమ పడ్డాన?
Also Read: సోది పెట్టిన మైఖేల్- పెళ్లి కూతురు కిడ్నాప్, స్వప్నని కావ్య కాపాడుతుందా?
కృష్ణ: ఏమైంది అత్తయ్య చెప్పాలనిపించకపోతే వద్దు. మీలాగా మీ అబ్బాయిలాగా మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నా
ఏసీపీ సర్ అనుకున్నా రేవతి అత్తయ్య కూడా ఏదో దాస్తుందని కృష్ణ అనుమానపడుతుంది. మురారీ, ముకుంద ఇంటికి ఇంకా రాకపోవడంతో రేవతి కంగారు పడుతుంది. అప్పుడే ముకుంద బాధగా ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని రేవతి నిలదీస్తుంది. తన మనసెమీ బాగోలేదని ఏమో అడగొద్దని అంటుంది. ఏమి చెప్పకుండా ఏడుస్తుంటే రేవతి భయపడుతుంది. ఆదర్శ్ గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని కృష్ణ అడుగుతుంది.
ముకుంద: మా అమ్మకి హెల్త్ బాగోలేదని సీరియస్ కండిషన్ అని కాల్ వచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే మురారీ కనిపించాడు. అమ్మ పరిస్థితి బాగోలేదంటే హాస్పిటల్ లో దించారు.
కృష్ణ: ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది
ముకుంద: తనకి క్యాన్సర్ ఇప్పుడప్పుడే ఏమి చెప్పలేమని అంటున్నారు
Also Read: రాజ్యలక్ష్మి మాటకి తలొంచిన దివ్య- లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భాగ్య
అప్పుడే మురారీ ఇంటికి వస్తాడు. కృష్ణ వెళ్ళి తనని కౌగలించుకుంటుంది. ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు మీకోసం నేను పిచ్చి దాన్ని అయిపోతున్నా తెలుసా? అని మాట్లాడినట్టు కృష్ణ ఊహించుకుంటుంది. అత్తయ్యకి ఎలా ఉందని ముకుందని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళావు కనీసం ఫోన్ కూడా చేయలేదు నీ పెళ్ళానికి ఏడుపు ఒక్కటే తక్కువని అనేసరికి మురారీ ఆశ్చర్యపోతాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత కృష్ణ బుంగమూతి పెట్టి కూర్చుంటుంది. తన చేయి పట్టుకుని అదిగినట్టే అడిగి మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడూ ఇలా చెప్పకుండా వెళ్లనని సోరి చెప్తే అలక తీరుదామని అనుకుంటుంది.
అలేఖ్య తాగేసి ముకుంద మురారీని లవ్ చేస్తుందని చెప్పేస్తుంది. మధుకర్ అది విని షాక్ అవుతాడు. ముకుంద మురారీకి ప్రపోజ్ చేయడం డైరెక్ట్ గా చూశానని మధుకర్ బయట పెడతాడు. కృష్ణ మురారీ వచ్చి బతిమలాడతాడని అనుకుంటుంది. కానీ ఏమి పట్టనట్టు ఉండి తర్వాత వెళ్ళి తన పక్కనే నిలబడి ఇమిటేట్ చేస్తాడు. బెట్టు చేస్తున్నావా కోపంగా కూడా ఉన్నట్టు ఉన్నావ్? ఎందుకో తెలుసా అని అడుగుతాడు. చెప్పకుండా వెళ్లిపోయానని అలిగావా అని సోరి చెప్తాడు. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్లనని మాట ఇస్తాడు.