టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి డైరెక్షన్ లో మరో కొత్త సినిమా రాబోతోంది. ఈ మూవీలో రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అయినా ఇప్పటికీ మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేయలేదు. ‘బోయపాటిరాపో’ అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోందని టాక్. తాజాగా ‘బోయపాటిరాపో’ నుంచి ఒక కొత్త అప్డేట్ ను తీసుకొచ్చారు మేకర్స్. మూవీ టైటిల్ ను అతి త్వరలో అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో రామ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బోయపాటి యాక్షన్ కు రామ్ ఎనర్జీ తోడైతే..
బోయపాటి శ్రీను సినిమా టేకింగ్ స్టైల్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్స్, యాక్షన్ ను బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే ఉంటుంది. ‘భద్ర’ సినిమా నుంచి మొన్న వచ్చి అఖండ వరకూ అన్ని సినిమాలలో ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ కు కొదవేం ఉండదు. అలాంటి దర్శకుడికి రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ తోడైతే ఆ మూవీ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈ ఇద్దరి కాంబోలో సినిమాను అనౌన్స్ చేయగానే అందరిలో ఉత్కంఠ మొదలైంది. మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. జూలై 3 న ఉదయం 11:25 గంటలకు మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో రామ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారంలో ‘స్కంథ’ టైటిల్..
బోయపాటి, రామ్ కాంబో మూవీ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేయకముందే సోషల్ మీడియాలో ఓ టైటిల్ సర్క్యులేట్ అవుతోంది. బోయపాటి, రామ్ మూవీకు ‘స్కంథ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు అంటూ ఊహాగాన వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీమ్ ఇప్పటి వరకూ ఏమీ స్పందించలేదు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ‘స్కంథ’ అనే టైటిల్ నే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా లేదా వేరే టైటిల్ ఏమైనా ఉందా అనేది తెలియాలి అంటే జులై 3 వరకూ ఆగాల్సిందే.
రామ్ మూవీకు పోటీగా మరో రెండు సినిమాలు..
ఈ ‘బోయపాటిరాపో’ సినిమా సెప్టెంబర్ 15 న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన విడుదల వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు సెప్టెంబర్ 15 న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఇదే రోజు ‘టిల్లు స్క్వేర్’, ‘చంద్రముఖి 2’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరు బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడతారో చూడాలి. ఇక ‘బోయపాటిరాపో’ మూవీను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
Also Read: రామ్ చరణ్ కుమార్తెకు ముఖేష్ అంబానీ కాస్ట్లీ గిఫ్ట్ - అసలు విషయం ఇదీ!