Animal: బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తోన్న మూవీ ‘యానిమల్’. మూవీ లవర్స్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీను ఆగస్టు 11 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ‘యానిమల్’ లవర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది మూవీ టీమ్. గతంలో ఇచ్చిన మూవీ డేట్ ను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రణబీర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.
త్వరలో కొత్త రిలీజ్ డేట్..
ఈ ఏడాది విడుదల అయ్యే సినిమాలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాలలో ‘యానిమల్’ సినిమా కూడా ఒకటి. ఈ మూవీలో రణబీర్ కపూర్ ను సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ విడుదల అయిన ప్రచార చిత్రాలు చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమా విడుదల పట్ల రణబీర్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేయడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘యానిమల్’ మూవీను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై మూవీ టీమ్ కు కూడా స్పష్టత లేనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల కావచ్చు లేదా ఇంకా లేట్ అవ్వొచ్చు అనే చర్చ నడుస్తోంది. ఇదే విషయం పై మూవీ టీమ్ గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోంది. అనేక మీటింగ్ లు తర్వాత మూవీను వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి విడుదల తేదీ ఏంటి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అయితే ఆగస్టు నెలలో నాలుగు పెద్ద సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ‘గదర్ 2: ది కథా కంటిన్యూస్’, ‘OMG 2’, ‘జైలర్’, ‘భోలా శంకర్’ సినిమాలు ఉన్నాయి.
పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘యానిమల్’..
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న మూవీయే ఈ ‘యానిమల్’. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ కథపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది ఒక పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ అని చెప్తున్నారు. ఇందులో యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం, డ్రామా, థ్రిల్, సంగీతం ఇలా అంశాలు కలిసి ఉంటాయని టాక్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాను భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని కలసి నిర్మిస్తున్నారు.
Also Read: ‘యాత్ర 2’ని ప్రకటించిన మహి వి రాఘవ్ - టాప్ క్లాస్ టెక్నీషియన్లతో - రిలీజ్ ఎప్పుడంటే?