ప్రభాస్ బీజీగా ఉన్నావా అంటే సమాధానం కూడా చెప్పలేనంత బిజిగా ఉన్నానంటాడేమో. వరుస ప్రాజెక్ట్స్ తో యంగ్ రెబల్ స్టార్ ఆ స్థాయిలో జోరుమీదున్నాడు. ప్రస్తుతం 'రాధే శ్యామ్' షూటింగ్  పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 'ఆదిపురుష్' ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా ఓమ్ రౌత్ ప్రకటించాడు. 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ కూడా ప్రారంభమైందని నాగ్ అశ్విన్ టీమ్ చెప్పింది. ఈ టైమ్ లో 'సలార్' షూటింగ్ కి సంబంధించి అప్ డేట్ వచ్చింది. 'ప్రాజెక్ట్ కే' షెడ్యూల్ పూర్తైన వెంటనే సలార్ షూటింగ్ ప్రారంభించనున్నారట. ఇప్పటికే షూట్ చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ కు సంబంధించిన ప్యాచ్ వర్క్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే 'సలార్‌' స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ నటించనుందని టాక్. సాహో సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన శ్రద్ధా కపూర్... సలార్ లో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయనుందట. 


అభిమానులు సాధారణంగా రీ షూట్ ని నెగెటివ్ సెంటిమెంట్ గా ఫీలవుతారు. కానీ 'సలార్' షూట్ విషయంలో మాత్రం అలా ఆలోచించడం లేదు. ఎందుకంటే వరుస ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ బిజీగా ఉండడం ఓ కారణం అయితే .. ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నందున మరింత మెరుగులు దిద్దుకునే ఛాన్స్ ఇదే అంటున్నారు. దీంతో ప్రాజెక్ట్ కే షెడ్యూల్ పూర్తయ్యాక 'సలార్' షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్. 'కేజీఎఫ్' లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో  సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి  2022 ఎప్రిల్ 14 సలార్ విడుదల తేదీ అని అఫీషియల్ గా ప్రకటించారు. కానీ అదే దర్శకుడి మరో మూవీ KGF 2 వస్తుండడంతో సలార్ వాయిదా పడినట్టే అనుకోవాలి. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 


Also Read: విల‌న్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి