Govinda:  బాలీవుడ్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదవశాత్తు సొంత తుపాకీ పేలడం వల్ల​ గాయపడ్డారు. గోవింద దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది. తెల్లవారుఝామున 5 గంటల సమయంలో రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా అది మిస్‌ఫైర్‌ అయ్యిందని తెలుస్తోంది. కాలికి తీవ్రంగా గాయమైంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది గోవిందాను ఆసుపత్రికి తరలించారు.


  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోవింద తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.  ఆ తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్ మిస్ ఫైర్ కావడంతో గోవిందా కాలుకి తీవ్రగాయమైంది. కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమైన గోవిందా.. రివాల్వర్‌ని శుభ్రం చేసి అల్మారాలో ఉంచారు. ఈ సమయంలో పిస్టల్ నేలపై పడి మిస్ పేలింది. అందుకే గాయం మోకాలి కింద తగిలింది. ఈ ఘటన జరిగే సమయానికి భార్య ముంబైలో లేరు.. ఈవిషయం తెలిసిన వెంటనే సునీత ముంబైకి చేరుకుంది.  

 



గోవిందా తండ్రి అరుణ్ కుమార్ అహుజా పాకిస్తాన్‌లోని గుజ్రన్‌వాలా.  గోవిందా జన్మించింది మాత్రం ముంబైలోనే. పాక్ నుంచి గోవింద కుటుంబం భారత్ కు తరలివచ్చింది. బాలీవుడ్ నటుడు గోవిందా  'లవ్ 86' మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైమ్ లోనే బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. 1987లో సునీత అహుజాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె టీనా , కొడుకు యశ్. 


90లలో బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన గోవిందా.. హీరో నెంబర్ వన్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వరుస మూవీస్ లో నటించి స్టార్ హీరో స్టేటస్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ఆ మధ్య ఓ ఇంటర్యూలో గోవిందా కెరీర్ గురించి మాట్లాడిన పహ్లాజ్ నిహ్లానీ అప్పట్లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 'మా మధ్య అనుబంధం ఉంది, కానీ తనతో పనిచేసేటప్పుడు ఎప్పుడూ అనిశ్చితి ఉండేది. ఎలాంటి ఆలోచన లేకుండా  డజన్ల కొద్దీ బి-సి గ్రేడ్ సినిమాలకు సైన్ చేశాడు. ఏకంగా 5-6 సినిమాలకు పని చేస్తున్నారు..ఎక్కడున్నాడో ఎవరికీ తెలియలేదు. అందుకే గోవిందా కెరీర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు.


Also Read: ‘కమిటీ కుర్రోళ్లు’కి జాతీయ అవార్డు అర్హత ఉంది - 50 రోజుల వేడుకలో నాగబాబు!


గోవిందా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈమధ్యకాలంలో ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. పలు రియాల్టీ షోస్ లో సందడి చేస్తున్నారు. గోవిందా తన భార్య సునీతతో టీవీ షోస్ లో సందడి చేస్తుంటారు. ఈ సందర్భంగా  వృత్తి జీవితంతో పాటూ వ్యక్తిగత జీవితం గురించి కూడా అభిమానులతో చాలా విషయాలు పంచుకుంటారు గోవిందా.  తమ జీవితంలో జరిగిన ఓ బాధాకరమైన విషయం గురించి రీసెంట్ గా ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు  గోవిందా, సునీత. 


వీరికి పెళ్లైన ఏడాదికే టీనా జన్మించింది. ఆ తర్వాత మరో అమ్మాయి పుట్టింది కానీ నెలలు నిండకుండా జన్మించడంతో ఆ బిడ్డ మూడు నెలలకే చనిపోయిందని ఓ ఇంటర్యూలో తన బాధను పంచుకున్నారు గోవిందా దంపతులు. ఆ తర్వాత పుట్టిన   యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నామన్నారు. ఎప్పుడూ పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని చెప్పుకొచ్చింది సునీత. పైగా టీనా కన్నా యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో గారాబం ఎక్కువని చెప్పుకొచ్చారు దంపతులు. 


ప్రస్తుతం గోవిందాకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు....


Also Read: దేవర సక్సెస్ మీట్... గురువారం గుంటూరులోని ఆ ఏరియాలో!