Madhavi Latha Fires On AP Minister Anitha: హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలకు, అనుమతుల పేరుతో ఏపీ సర్కారు చలాన్లు విధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైక్ పర్మిషన్‌ కు, విగ్రహం హైట్‌ ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చెప్పడం పట్ల భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీకు చిల్లర ఏరుకోవడానికి హిందువుల పండగలే దొరికాయా? అంటూ పలువురు భక్తులు మండిపడుతున్నారు.  


హిందూ పండుగలపై పడి ఏడ్వటం ఫ్యాషన్ అయ్యింది- మాధవీ లత


గణేష్ మండపాలకు చలాన్లు చెల్లించి పర్మీషన్ తీసుకోవాలన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వాళ్లకు హిందూ పండుగలపై పడి ఏడ్వటం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. చలాన్లు విధించే బదులు బిచ్చం అడుక్కుంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్లన్నారు. “ఏపీలో వినాయక మండపాలకు చలానాలు ఇవ్వడం దారుణం. కూటమిలో ప్రభుత్వంలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తా. ప్రతి వాళ్లకూ హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా? మైక్ పర్మిషన్ కు రూ.100, విగ్రహాలకు రూ.350 ఇవ్వాలా? ఇదేంటని అడిగితే పర్యావరణ పరిరక్షణ అంటూ కొత్త కథలు చెప్తారు. వినాయక విగ్రహాల కారణంగానే భూమ్మీద మొత్తం కాలుష్యం అవుతున్నట్లు కొన్ని బ్యాచ్ లు ప్రచారం చేస్తాయి. అమాయకపు అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపిన ఉన్మాదులకు మరణశిక్ష విధిస్తే మానవహక్కుల ఉల్లంఘ అంటూ వచ్చే బ్యాచ్ లు, వినాయక విగ్రహాలతో కాలుష్యం అవుతుందని చెప్పే గుంపులు ఒకటే. తొమ్మిది రోజుల పాటు వినాయక మండపాల దగ్గర మైకులు పెట్టుకుంటే చలాన్లు కట్టాలన్న ప్రభుత్వం, రోజూ నాలుగు సార్లు నమాజ్ చేసే ముస్లీంలకు, అర్థరాత్రి వరకు మైకులు పెట్టి గోల చేసే క్రిస్టియన్లకు చలానాలు విధించే దమ్ముందా?” అంటూ నిలదీశారు.    






సైలెంట్ గా ఉన్న ఏపీ బీజేపీ నాయకులు


ఏపీలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి సర్కారును నడిపిస్తున్నారు. అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, వినాయక విగ్రహాల ఏర్పాటుకు చలాన్లు చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైక్ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే రూ.350, 6 అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలని హోంమంత్రి అనిత వెల్లడించింది. ఈ నిర్ణయం బీజేపీ నేతలలో తీవ్ర ఆగ్రహానికి కారణం అయ్యింది. బయటకు ఎవరూ మాట్లాడకపోయినా, లోలోపల మాత్రం కోపంతో ఊగిపోతున్నారు. బీజేపీ నాయకురాలు మాధవీ లత తొలిసారి ఈ విషయంపై స్పందించడంతో మిగతా వాళ్లు కూడా ఆమెతో జత కలిసే అవకాశం ఉంది.


Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?