Jigra movie teaser out: బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ మూవీక సంబంధించి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ యాక్షన్, ఎమోషన్స్ తో ఈ సినిమాను రూపొందించారు. అక్క, తమ్ముడు మధ్య సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ఆలియా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడంతో టీజర్ ప్రారంభం అవుతుంది.  తన కుటుంబంలో తమ్ముడు, తాను తప్ప ఎవరూ ఉండరని చెప్తుంది. కొన్ని కారణాలతో విదేశాల్లో ఆమె తమ్ముడిని జైల్లో వేస్తారు. ఇంతకీ ఆయన జైలుకు ఎందుకు వెళ్లాడు? తన సోదరుడిని జైలు నుంచి ఎలా విడిపించుకుంది? ఈ ప్రయాణంలో ఆమె ఎవరి నుంచి మద్దతు లభించింది? జైల్లో తన తమ్ముడు ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాడు? అనేది చూపించారు. సిబ్లింగ్స్ సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది.   



వరుస అప్ డేట్స్ ఇస్తున్న మేకర్స్


బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆలియా భ‌ట్ పోస్టర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. క్యారెక్టర్ లో డెప్త్, గాంభీర్యం క‌నిపిస్తోంది. కోపంగా చూస్తూ రక్తంతో నిండిన పిడికిలిన వెనుకవైపు పెట్టి బిగించిన కనిపించింది. ఈ చిత్రంలో ఆలియా సోదరుడిగా వేదాంగ్ రైనా నటించారు. ‘జిగ్రా’ అంటే, హృదయం, ధైర్యం అనే అర్థాలున్నాయి. దానికి తగినట్లుగానే ఈ సినిమాలో సిబ్లింగ్స్ సెంటిమెంట్ తో పాటు తమ్ముడి కోసం ధైర్యంతో పోరాడే యువతిగా అలియా కనిపించనుంది.



దసరా కానుకగా ‘జిగ్రా’ విడుదల


‘జిగ్రా’ సినిమా ను ఈ నెల 27న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ ‘దేవర’ విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే ‘జిగ్రా’ విడుదలను వాయిదా వేశారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న విడుదలచేయనున్నట్లు వెల్లడించారు. విజయ దశమి రోజున ‘జిగ్రా’ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాను అలియా సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ తో పాటు ధర్మ ప్రొడక్షన్స్‌, వయాకామ్18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది ఆలియా ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ కహానీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. ‘జిగ్రా’తో బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తోంది.


Read Also: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ



Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?