హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఒక హోట‌ల్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె సొంతూరు (కేరళ) నుంచి వేరే ప్రాంతానికి (ముంబై) వెళ్లారు. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ముందుగానే రూమ్స్ బుక్ చేశారు. అయితే...  సదరు హోటల్ సిబ్బందితో ఫుడ్ విషయంలో ప్రియా ప్రకాష్ వారియర్‌కు గొడవ జరిగింది. తాను ఎంత చెప్పినా, వివరించినా... వినిపించుకోకుండా వాళ్లు పెద్ద సీన్ చేశారని ఆమె వాపోయారు. హోటల్ ఎంట్రన్స్ ముందే ఫుడ్ తినాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. అసలు, వివాదం ఏమిటి? దాని గురించి ప్రియా ప్రకాష్ వారియర్ ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే...


"ఫెర్న్ గోరెగావ్ హోట‌ల్ పాలసీ ప్ర‌కారం హోట‌ల్‌లోకి బయట ఫుడ్‌ను అస్సలు  అనుమతించరు. ఎందుకంటే... అతిథులు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకు ఎక్స్ట్రా మనీ వస్తుంది. నాకు ఆ సంగతి తెలియదు. షూటింగ్ నుంచి వస్తూ వస్తూ దారిలో ఫుడ్ తీసుకున్నాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... హోటల్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్స్ ఆర్టిస్టులు కాకుండా ప్రొడక్షన్ హౌస్‌లు చేస్తాయి కాబట్టి వాళ్లు తమ పాలసీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించవచ్చు. నాకు ఫుడ్ పారేయడం ఇష్టం లేదని, అలాగే ఫుడ్‌కు డబ్బులు ఇచ్చాను కాబట్టి ఈ ఒక్కసారికి అనుమతించమని మర్యాదగా అడిగాను. రిక్వెస్ట్ చేశాను. నేను తీసుకువచ్చిన ఫుడ్ బయట పెట్టమని లేదంటే పారేయమని చెప్పారు. పెద్ద సీన్ చేశారు. నేను చెప్పేది వినడానికి రెడీగా కూడా లేరు. చాలా అమర్యాదగా ప్రవర్తించారు. దాంతో బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చింది" అని ప్రియా ప్రకాష్ వారియర్ పేర్కొన్నారు. అదీ సంగతి!


'ఒరు ఆదార్ లవ్' సినిమాలో కన్ను కొట్టే సన్నివేశంతో ప్రియా ప్రకాష్ వారియర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో నితిన్ 'చెక్' సినిమాలో చిన్న రోల్ చేశారు. తేజ సజ్జా  సరసన 'ఇష్క్' సినిమాలో నటించారు. 'లడి లడి' మ్యూజిక్ వీడియో కూడా చేశారు.


Also Read: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి
Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?
Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.