Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో అన్ని ఎమోషన్స్ ను చూపిస్తున్న వ్యక్తిగా రేవంత్ నిలిచిపోతాడు. మొదటి వారంలోనే ఆయన తన ఎమోషన్స్ అన్నింటినీ బయటపెట్టేశాడు. రెండో వారం కూడా అదే కొనసాగుతోంది. కోపం వచ్చినప్పుడు కోపం, నవ్వొచ్చి నవ్వు, అరుపులు, వాదనలు, ఏడుపులు... ఇలా తనలోని వ్యక్తిత్వం బయటపెట్టేశాడు రేవంత్. ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించి మరో కొత్త ప్రోమో విడుదలైంది అందులో కూడా రేవంత్ చివర్లో ఏడుస్తూ కనిపించాడు. 


ప్రోమోలో ఏముంది...
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ను బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చారు. అందులో ప్రతి ఒక్కరి ఒక్కో బొమ్మను ఇచ్చి చక్కగా చూసుకోమని చెప్పారు. అయితే ఆ బొమ్మను ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ఈ క్రమంలో రేవంత్ బొమ్మ ఒక చోట వదిలేశాడు. దాన్ని గీతూ తీసి ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ట్రేలో వేసింది. అందులో వేస్తే ఆ బొమ్మ తాలూకు ఇంటి సభ్యుడు ఆ ఆట నుంచి తొలగిపోయినట్టే. రేవంత్ ‘ఇక గేమ్ స్టార్ట్ అవ్వలేదు కదా’ అన్నాడు. షానీ మరికొందరితో మాట్లాడుతూ ‘అంతరం ఆడతాం, కానీ అలా ఆడము’ అని కామెంట్ చేశాడు. ఆదిరెడ్డి, గీతూ ఒక దగ్గర కూర్చుని ‘నిన్ను ఈసారి కూడా అందరూ నామినేట్ చేసేట్టు ఉన్నారు’ అని అంటే గీతూ వెటకారంగా నవ్వింది. 


నేహా ఫైర్
కెప్టెన్ బాలాదిత్య ‘ఎవరి బొమ్మలైతే అందులో పెట్టేస్తారో, వారు ఆటలోంచి తొలగిపోయినట్టే’ అని చెప్పాడు. దానికి రేవంత్ సంచాలక్ ఉన్నప్పుడు ఏం చెప్పరా? అని నేహాను ఉద్దేశించి అన్నాడు. దానికి నేహా ‘నేను సంచాలక్ కాదు’ అంటూ ఏదో చెప్పబోయింది. దానికి రేవంత్ కోపం లేచి వెళ్లిపోయాడు. దీంతో నేహా ‘నువ్వు మాట్లాడుతున్నప్పుడు అందరం విని రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, నువ్వు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు విని రెస్పెక్ట్ ఇవ్వాలి’ అంది. దానికి రేవంత్ ‘నువ్వు వినాల్సిన అవసరం లేదు’ అంటూ కోపంగా వెళ్లిపోయాడు. 






మూడు నెలల్లో పుట్టబోతోంది
బిగ్ బాస్ రేవంత్ బొమ్మ లాస్ట్ ఫౌండ్ ఏరియాలో ఉన్నందున స్టోర్ రూమ్ లో తెచ్చి పెట్టమని ఆదేశించాడు. వెంటనే రేవంత్ ఆ బొమ్మను ప్రేమతో తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాడు. తరువాత మెరీనా- రోహిత్ జంటతో మాట్లాడుతూ చాలా బాధపడ్డాడు. ‘ఆ బేబీని రాత్రి తన పక్కన పడుకోబెట్టుకుందాని అనుకున్నా, ఆ ఫీల్..’ అంటూ ఏడ్చాడు. దానికి మెరీనా ‘గట్టిగా ఉండు, బాధపడద్దు’ అంది. దానికి రేవంత్ కన్నీళ్లు కారుస్తూ ‘కష్టం, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా’ అంటూ చాలా వేదనకు గురయ్యాడు. దానికి రోహిత్ ‘నీకు మూడు నెలల్లో బేబీ పుట్టబోతోంది’ అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు.  



Also read: అందుకే నా ప్రేమ బ్రేకప్, కన్నీళ్లు పెట్టిస్తున్న ‘బిగ్ బాస్’ ఆరోహీ లవ్ స్టోరీ!


Also read: సిసింద్రీ టాస్క్‌లో రేవంత్ గెలవకుండా అడ్డుకున్న ఫైమా, ఫైర్ అయిన రేవంత్