బిగ్‌బాస్ 5 విన్నర్ ఎవరో మరో నాలుగురోజుల్లో తేలిపోనుంది. అందుకే ఈ వారం ఏ టాస్కులు, గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతోంది. హౌస్లో ఉన్న అయిదుగురు తమ ఎమోషనల్ జర్నీని చూస్తూ, తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. బుధవారం ఎపిసోడ్ కు సబంధించి ప్రోమో విడుదలైంది. నేటి ప్రోమోలో హైలైట్ శ్రీరామే. మొదటిసారి హమీదా గురించి ప్రేమగా మాట్లాడాడు శ్రీరామ్. 


బిగ్ బాస్ తమకు ఇష్టమైన ఫోటోలను తీసుకుని, వాటి గురించి వివరించమని కోరారు సభ్యులను. శ్రీరామ్... హమీదాతో ఉన్న ఫోటోను తీసుకుని ‘ఇంతవరకు నేను ఎప్పుడూ చెప్పలేదు. హమీదాని చాలా మిస్సవుతున్నా. ఈ అమ్మాయి ఉండుంటే నేను ఒంటరివాణ్ని అయ్యుండను... ఐ మిస్ యూ హమీదా’ అని ఎమోషనల్ గా మారాడు. ఇక మానస్ సన్నీ, యానీ మాస్టర్‌ను హగ్ చేసుకున్న ఫోటోను చూపించి ‘ఇది టెడ్డీబేర్ టాస్క్‌ది, ఇది మా సెలెబ్రేటరీ హగ్, ఈ ఫోటో చూసినప్పుడు నాకు అనిపించేది ఒక్కటే ఎప్పడూ ఆశను కోల్పోవద్దూ’ అని వివరించాడు. సన్నీ కూడా మానస్‌తో తానున్న ఫోటోను  చూపించి ఈ హౌస్ లో ఓ గోల్డెన్ డైమండ్ డార్లింగ్  అంటే మానసేనని చెప్పాడు.  


ఇక సిరి షరా మామూలుగానే షన్నుని పైకెత్తేసింది. బ్రిక్ టాస్క్ ఫోటోను చూపించి షన్నును పొగిడేసింది. షన్ను మాత్రం తాను చాలా డిప్రెస్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటోను ఎంపిక చేసుకుని మాట్లాడాడు. ఉత్తరాన్ని చించేస్తున్నట్టు ఆ ఫోటోలో ఉంది. అది చాలా బాధాకరమైన సన్నివేశమని, తనకు చాలా డిప్రెస్ మూమెంటని చెప్పుకొచ్చాడు. నెవర్ గివప్ అంటూ ముగించాడు. 


#BiggBossTelugu house lo memories anedi eppatiki nilichipothayi#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBossTwitter pic.twitter.com/klPpr9nGjX


— starmaa (@StarMaa) December 15, 2021

" title="" >


Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్! 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి