Just In





Bigg Boss Telugu 9: 'బిగ్ బాస్ 9'కి హోస్ట్ నాగార్జున కాదా... విజయ్ దేవరకొండ వస్తున్నాడా? అసలు నిజం ఇదుగో
Bigg Boss Telugu 9 : 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 లో నాగ్ ప్లేస్ ను విజయ్ దేవరకొండ రీప్లేస్ చేయబోతున్నారు అనే వార్తల్లో నిజం ఎంత ?

బిగ్ బాస్ రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ రియాలిటీ షోకు అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ రావడమే అందుకు నిదర్శనం. ఇక తెలుగులో చాలా సీజన్ల నుంచి నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు. ఆయన సక్సెస్ ఫుల్ గా షోను రన్ చేయడంతో, ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ షో నడుస్తున్నప్పుడు, స్పెషల్ గా ఈ షో ఫ్యాన్స్ అందరూ వీకెండ్ ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తారు. నాగార్జున బుల్లితెర ప్రేక్షకులపై తన హోస్టింగ్ స్కిల్స్ తో అంతటి ఎఫెక్ట్ చూపించారు మరి. కానీ గత కొన్ని రోజుల నుంచి కొత్త సీజన్లో నాగార్జున హోస్ట్ గా కనిపించకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. 'బిగ్ బాస్ సీజన్ 9'కి ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పేరుని కొత్త హోస్ట్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు.
'బిగ్ బాస్ తెలుగు సీజన్ - 9' హోస్ట్ గా విజయ్ దేవరకొండ
'బిగ్ బాస్' తెలుగు 2017లో ప్రారంభమై ఇప్పడిదాకా 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక రెండో సీజన్ కి నాని హోస్టుగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఈ సీజన్ ఫస్ట్ సీజన్ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీజన్ 3కి నాగార్జునను హోస్టుగా దింపారు బిగ్ బాస్ మేకర్స్. అప్పటి నుంచి మొదలు పెడితే రీసెంట్ గా కంప్లీట్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 వరకు నాగార్జున వరుసగా ఈ షోకు హోస్ట్ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2, సీజన్ 6లో సెలబ్రిటీతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.
నాగార్జున హోస్ట్ చేసిన సీజన్లన్ని సక్సెస్ ఫుల్ అయిన నేపథ్యంలోనే సీజన్ 9 నుంచి ఆయన తప్పుకోబోతున్నాడు అనే వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో కొత్త సీజన్ కుహోస్టుగా వ్యవహరించేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫిలిం నగర్ సర్కిల్స్ లో విజయ్ దేవరకొండ కొత్త హోస్ట్ గా రాబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లు నిజమేనని తెలుస్తోంది. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' హోస్ట్ గా చేయడానికి మేకర్స్ విజయ్ దేవరకొండతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే విజయ్ దేవరకొండ కూడా ఈ ఆఫర్ కు సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. అయితే 'బిగ్ బాస్ తెలుగు 9' నుంచి తప్పుకుంటున్నట్టుగా నాగార్జున ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో దీనిపై అయోమయం నెలకొంది.
Also Read: 'దేవర' కోసం జపనీస్ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు... త్వరలో జపాన్ ప్రయాణం కూడా!
'బిగ్ బాస్ 8' విన్నర్ టైటిల్ ఎగరేసుకుపోయిన నిఖిల్
ఇక 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8'లో నిఖిల్ మలియక్కల్ గౌతమ్ కృష్ణను ఓడించి, టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. గౌతమ్ రన్నరప్ గా నిలవగా, నిఖిల్ ట్రోఫీతో పాటు నగదుని కూడా బహుమతిగా అందుకున్నాడు. నబీల్, ప్రేరణ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అవినాష్ మాత్రం నాలుగో రన్నరప్ గా మిగిలిపోయాడు.
ఇదిలా ఉండగా నాగార్జున ప్రస్తుతం 2 భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. అందులో ఒకటి రజనీకాంత్ 'కూలీ' సినిమా కాగా, మరొకటి ధనుష్ 'కుబేర' మూవీ. మరోవైపు విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాతో మే 30న ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
Also Read: సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్, హాస్పటల్ ఫోటోలు వైరల్... దయచేసి చూపించకండి - అనసూయ రిక్వెస్ట్