కొన్ని తెలుగు సినిమాల్లోనూ.. టీవీ సీరియళ్ల ద్వారా నూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పావనిరెడ్డి మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. కొన్నాళ్లుగా తాను  డేటింగ్ చేస్తున్న కొరియాగ్రఫర్, సహ నటుడు అమిర్‌ను మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఆ జంట  అనౌన్స్ చేశారు. వచ్చే ఏప్రిల్  20న వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా పూర్తయింది.






 


తెలుగు, తమిళ్ లో గుర్తింపు


2012లో లాగిన్ అనే హిందీ సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన పావని తర్వాత తెలుగు, తమిళ్ సినిమాల్లో  కొన్ని కీలకమైన పాత్రలు చేసింది.  తెలుగులో అమృతంలో చందమామలో ముఖ్య పాత్రతో పాటు.. అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవంలో అతని ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది.  తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ వచ్చిన తను.. టెలివిజన్ లోకి వెళ్లింది. అక్కడే తన సహనటుడు ప్రదీప్ తో ప్రేమలో పడింది. సినిమా కెరీర్ ముందుకు సాగకపోవడంతో తమిళ్, తెలుగు రెండు చోట్లా పలు టీవీ సీరియళ్లలో యాక్ట్ చేసింది. జెమినీ టీవీలోని అగ్నిపూలు, ఈటీవీలో నా పేరు మీనాక్షి సీరియళ్ల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు బాగానే పరిచయం. తమిళ్‌లో సన్ టీవీతో పాటు, స్టార్ విజయ్‌లో పలు సీరియళ్లలో నటించారు.


మొదటి పెళ్లి విషాదాంతం- భర్త సూసైడ్


నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన పావని- ప్రదీప్ 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన నాలుగు నెలలకే ఆమె భర్త ప్రదీప్ హైదరాబాద్ పుప్పాల గూడలో ఆత్మహత్య చేసుకున్నాడు.  పావని, ప్రదీప్ తో పాటు.. ఆమె కజిన్ శ్రవణ్ కలిసి అక్కడే ఉండేవారు. శ్రవణ్ తో బర్త్ డే పార్టీలో జరిగిన చిన్న ఆర్గ్యుమెంట్ తో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్ ఆత్మహత్య తర్వాత కొంతకాలం డిప్రెషన్ లో ఉన్న పావని తర్వాత మళ్లీ తమిళ్ టెలివిజన్ లో తన కేరీర్ స్టార్ట్ చేశారు.


బిగ్‌బాస్‌లో ఎంట్రీ


పావని రెడ్డి BiggBoss Tamil5 సీజన్‌లో కంటెస్టెంట్. అక్కడ ఆమె  ప్రదీప్ సూసైడ్‌తో పాటు తన లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడింది.  ప్రదీప్ మరణం తర్వాత తాను డిప్రెషన్‌కు గురయ్యానని.. ఆ తర్వాత కొంత కాలానికి మరో ప్రేమను వెతుక్కున్నప్పటికీ అందులో కూడా ఫెయిల్ అయ్యానని చెప్పారు. అదే BiggBoss హౌస్ లో అమిర్ ఆమెకు పరిచయమయ్యాడు. అక్కడ మొదలైన పరిచయం ప్రణయంగా మారింది. మూడేళ్లకు పైగా వీరు జంటగానే కనిపిస్తున్నారు. అయితే రీసెంట్ గా తమ మ్యారేజ్ ను కన్ఫామ్ చేసిన వీళ్లు ఫోటో షూట్ కూడా చేశారు.




అమిర్ కోరియోగ్రఫీ, యాక్టింగ్ తో పాటు ఊటీలో Amir’s Ads Crew అనే సంస్థనూ నిర్వహిస్తున్నారు. పావని కర్ణాటకకు చెందిన తెలుగమ్మాయి. మొదట్లో మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి.. మెల్లిగా సినిమాలు, సీరియల్స్ లో చేశారు. ఈ మధ్యనే తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. వెన్నల కిషోర్ నటించిన చారి 111 లో పావని రెడ్డి కీలకమైన రోల్ చేసింది. Hotstarలో స్ట్రీమ్ అవుతున్న Mystery of Moksha Island  తను కీలకపాత్ర చేసింది.