Jyothika: నీ భర్త సూర్య కంటే విజయ్ బెటర్ అంటూ ట్రోల్స్ - నటి జ్యోతిక రిప్లై ఏంటంటే?

Trolls On Vijay: తన భర్త సూర్యను ట్రోల్ చేయడంపై నటి జ్యోతిక స్పందించారు. డ్రాగన్ మూవీ కలెక్షన్లు, కోలీవుడ్ హీరో విజయ్‌తో పోలుస్తూ కామెంట్ చేయగా ఆమె హాస్యాస్పదం అని వచ్చేలా ఎమోజీతో రిప్లై ఇచ్చారు.

Continues below advertisement

Jyothika Reacts Trolling On Her Husband Surya: సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక కపుల్ ఒకటి. వీరు సందర్భానుసారం సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. తాజాగా.. జ్యోతిక (Jyothika) తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ కామెంట్ సెక్షన్‌లో కొందరు నెటిజన్లు ఆమె భర్త సూర్యను (Surya) ట్రోల్ చేశారు. ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ మూవీ 'డ్రాగన్' కలెక్షన్లతో పోలుస్తూ ట్రోల్ చేశారు. అలాగే, మరో నెటిజన్ సూర్య కంటే కోలీవుడ్ హీరో విజయ్ బెటర్ అని కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన జ్యోతిక.. హాస్యాస్పదం అనే అర్థం వచ్చేలా ఓ నవ్వు ఎమోజీని పెట్టారు. ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం కొద్దిసేపటి తర్వాత జ్యోతిక ఆ ఎమోజీని డిలీట్ చేశారు.

Continues below advertisement

మరోవైపు, జ్యోతిక (Jyothika) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్'.. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో శుక్రవారం (ఫిబ్రవరి 28) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో తన తొలి చిత్రం అక్షయ్ ఖన్నాతో నటించానని.. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదని తెలిపారు. అందువల్లే ఆ తర్వాత ఆఫర్లు రాలేదని చెప్పారు. కోలీవుడ్‌లో తన భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. బయట ఎంత స్టార్లైనా ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ స్టార్ డమ్ వదిలేస్తామని వెల్లడించారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తమ పిల్లలకు పేరెంట్స్‌గానే ఉంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జ్యోతిక ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు. మరోవైపు.. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రెట్రో' మూవీలో నటిస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?, టీవీలోనూ చూసి ఎంజాయ్ చెయ్యండి!

డబ్బా కార్టెల్ స్టోరీ ఏంటంటే.?

జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'డబ్బా కార్టెల్' (Dabba Cartel) వెబ్ సిరీస్‌కు హితేశ్ భాటియా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఇందులో షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే, అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలక పాత్రలు పోషించారు. లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే మధ్యతరగతికి చెందిన ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. డబ్బా సర్వీస్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. వీరు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ప్రధానాంశంగా ఈ సిరీస్ ఉంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఈ కాంబో కుకింగ్ షోలో వర్కౌట్ అవుతుందంటారా? - సుమక్క కుకింగ్ షోలో సురేఖవాణి కూతురు సుప్రీత, కమెడియన్ యాదమ్మరాజు

Continues below advertisement