Venkatesh's Sankranthiki Vasthunnam OTT Release On Zee5: టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుందని అంతా భావించినా ముందుగా జీ తెలుగులో (Zee Telugu) ప్రీమియర్ చేయనున్నట్లు వెల్లడించింది. ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని సైతం జీ5 అధికారికంగా వెల్లడించింది. మార్చి 1న సాయంత్రం అటు జీతెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో ఓటీటీ ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.


ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్.. ఆ సీన్స్ యాడ్.?


అయితే, ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలో నిడివి కారణంగా థియేటర్‌లో కొన్ని సీన్లను తొలిగించారట. ఆ కామెడీ సీన్లను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈ సీన్స్ సినిమాకు మరింత బలం చేకూరుస్తాయనే టాక్ వినిపిస్తోంది. కామెడీ సీన్స్ సహా హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి మద్య సీన్స్ కూడా యాడ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే పండుగే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల 'పుష్ప 2' వంటి బ్లాక్ బస్టర్ ఓటీటీ వెర్షన్‌లోనూ కొన్ని సీన్స్ యాడ్ చేసి స్ట్రీమింగ్ చేశారు. 


Also Read: ఆ ఊరిలో మర్డర్, మిస్సింగ్ కేసుల మిస్టరీ - ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'సుళుల్: ది వర్టెక్స్' సీజన్ 2, తెలుగులోనూ వచ్చేస్తోంది!


టీవీలోనూ ప్రసారం..






'సంక్రాంతికి వస్తున్నాం' ముందుగా ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. డిఫరెంట్‌గా ముందుగా టీవీలోకి ప్రీమియర్ చేయనున్నట్లు జీ5 ప్రకటించింది. లేటెస్ట్‌గా అదే రోజున ఓటీటీలోకి సైతం ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఆదివారం టీఆర్పీ రేటింగ్ బాగా వస్తుందని ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, మూవీ ప్రసారం అయ్యే టైంలో జరిగే కాంటెస్ట్‌లో పాల్గొని అద్భుతమైన గిప్ట్స్ గెలుచుకోవాలని జీ తెలుగు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.


రూ.300 కోట్ల కలెక్షన్లు


సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. వెంకీ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించగా.. 'బుల్లిరాజు'గా ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. వెంకీ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.


Also Read: ఈ కాంబో కుకింగ్ షోలో వర్కౌట్ అవుతుందంటారా? - సుమక్క కుకింగ్ షోలో సురేఖవాణి కూతురు సుప్రీత, కమెడియన్ యాదమ్మరాజు