Anil Kapoor: బిగ్ బాస్.. భాష ఏదైనా ఈ షో టాప్. సెల‌బ్రిటీలంద‌రినీ ఒక హౌస్‌లో ఉంచి, వాళ్ల మ‌ధ్య టాస్క్ లు పెట్టి ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేస్తారు. హౌస్ లో కొట్టుకోవ‌డాలు, త‌గువులాట‌లు, టాస్క్ గెలిచేందుకు వ్యూహ ర‌చ‌న‌లు.. ప్రేక్ష‌కులను తెగ ఆక‌ట్టుకుంటాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే... వీకెండ్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు చాలామంది. ఎందుకంటే శ‌ని, ఆదివారాల్లో హోస్ట్ వ‌చ్చి త‌ప్పు ఒప్పులు చెప్పి, అంద‌రికీ గ‌డ్డి పెడ‌తాడు. అంతేకాకుండా కొన్ని ఫ‌న్నీ టాస్క్ లు ఆడి ఫ‌న్ క్రియేట్ చేస్తాడు. అందుకే వీకెండ్ ఎపిసోడ్స్ కోసం చూస్తారు చాలామంది. ఇక దాదాపు హోస్ట్ గా హీరోలు ఉంటారు. దీంతో వాళ్ల ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. కానీ, హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజ‌న్ - 3 లో ప‌రిస్థితి వేరుగా ఉంది. ఈ హోస్ట్ మాకు వ‌ద్దు బాబు అని పోస్ట్ లు పెడుతున్నారు ప్రేక్ష‌కులు.


హిందీ బిగ్ బాస్ కి స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి ఆయ‌న హోస్టింగ్ కి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఈసారి మాత్రం సీజ‌న్ - 3 ఓటీటీకి అనిల్ క‌పూర్ హోస్ట్ గా వ్య‌వహ‌రిస్తున్నారు. అయితే, ఆయ‌న హోస్టింగ్ న‌చ్చ‌లేద‌ట ప్రేక్ష‌కుల‌కి. ఏమి హోస్ట్ రా నాయ‌నా! అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం రెడిట్ లో ఒక వ్య‌క్తి పోస్ట్ చేయ‌గా.. ఆయ‌న‌కు స‌పోర్ట్ గా చాలామంది చాలా కామెంట్లు పెడుతున్నారు. 
 “ హోస్ట్ గా అనిల్ క‌పూర్ ఈ సిజ‌న్ కే లాస్ట్ అయితే బాగుండు. ప్ర‌తి వారం ఫేక్ న‌వ్వు, ఫేక్ కోపం, ఫేక్ వ్య‌క్తిత్వాన్ని చూడ‌లేక అల్లాడిపోతున్నాం” అని ఒక వ్య‌క్తి కామెంట్ పెట్టగానే ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ప్రొడ్యూస‌ర్లు ఆయ‌న్ను హోస్ట్ గా కంటిన్యూ చేయ‌డాన్ని మ‌ళ్లి ఒక‌సారి ఆలోచించాల‌ని ఒక నెటిజ‌న్ కోర‌గా.. ఇంకోక‌రేమో.. ఆయ‌న్ను షోకి హోస్ట్ గా ఆపేయండి.. బిగ్ బాస్ వాయిస్ ఒక్క‌టే మాకు చాలు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో కూడా వైర‌ల్ చేస్తున్నారు చాలామంది బిగ్ బాస్ ప్రేక్ష‌కులు. 


స‌ల్మాన్ బిజీగా ఉండ‌టంతో.. 


ప్ర‌తి సీజ‌న్ కి హోస్ట్ గా స‌ల్మాన్ ఖాన్ వ్య‌వ‌హ‌రించే విష‌యం తెలిసిందే. అయితే, ఈసారి ఆయ‌న సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండ‌టంతో అనిల్ క‌పూర్ ని హోస్ట్ గా ఎంచుకున్నారు. ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ 'సికంద‌ర్' సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. 


ఇక అనిల్ క‌పూర్ విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న సురేశ్ త్రివేణి ద‌ర్శ‌క‌త్వంలో 'సుబేదార్' సినిమాలో న‌టిస్తున్నారు. దాంతో పాటుగా.. 'వైఆర్ ఎఫ్ స్పై యూనివ‌ర్స్', 'వార్ 2', 'ఆల్పా', 'ప‌టాన్ - 2' సినిమాల్లో కూడా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 


Also Read: ఒలింపిక్‌ జ్యోతితో చిరంజీవి - భార్య సురేఖతో అలా, సంతోషకరమైన క్షణమిది అంటూ పోస్ట్‌