Chiraneevi: ఒలింపిక్ జ్యోతితో చిరంజీవి - భార్య సురేఖతో అలా, సంతోషకరమైన క్షణమిది అంటూ పోస్ట్
Chiranjeevi With Olympic Torch replica: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకలో భాగంగా ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనసవరాలు క్లింకారతో కలిసి పారిస్ టూర్ వెళ్లారు.
అక్కడ పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతూ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా మరో ఫోటో షేర్ చేశారు.
ఇందులో ఆయన ఒలింపిక్ జ్యోతి (ఒలింపిక్ టార్చ్ రెప్లికా) ప్రతి రూపాన్ని పట్టుకుని కనిపించారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరు కావడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
సురేఖతో కలిసి ఒలింపిక్ జ్యోతి ప్రతిరూపాన్ని పట్టుకుని సంతోషాన్ని ఇచ్చాయి. మన భారత జట్టులోని ప్రతి క్రీడాకారుడు అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నాను. భారత్‌కు గతంలో ఎన్నడూ రానన్ని పతకాలు రావాలని ఆకాంక్షిస్తున్నా.. జై హింద్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. కాగా ఉపాసన, రామ్ చరణ్‌లు కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక పారిస్ రోడ్డులో క్లింకారతో కలిసి నడుచుకుంటు వెళుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.