Bigg Boss OTT 3: ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ఎన్నో కాంట్రవర్సీలతో ముందుకెళ్తోంది. తాజాగా మరో కాంట్రవర్సీ వెలుగులోకి వచ్చింది. ఇందులో కంటెస్టెంట్‌గా వచ్చిన అర్మాన్ మాలిక్.. తన రెండో భార్య క్రితికా మాలిక్‌తో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలామంది ప్రేక్షకులు దీనిని ఖండించడానికి ముందుకొచ్చారు. కానీ బిగ్ బాస్‌ను ప్రసారం చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో సినిమా మాత్రం అది ఒరిజినల్ వీడియో కాదని, ఎవరో దానిని మార్చారని ప్రకటించింది.
మార్ఫ్ వీడియో..
అసలు షోలో అలా జరగడం అసాధ్యం అంటూ జియో సినిమా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘‘జియో సినిమాలో ప్రసారమయ్యే కంటెంట్ విషయంలో మేము చాలా కఠినమైన ప్రోగ్రామింగ్ రూల్స్ పాటిస్తాం. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న బిగ్ బాస్‌లో అశ్లీల కంటెంట్ ఏం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌ను మార్ఫ్ చేశారు. అది పూర్తిగా ఫేక్. మేము మా గౌరవాన్ని, వ్యూయర్స్‌కు మా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఇలాంటి ఒక వీడియో క్లిప్‌ను క్రియేట్ చేయడాన్ని, వైరల్ చేయడాన్ని మేము సీరియస్‌గా తీసుకుంటాం’’ అని జియో సినిమా తెలిపింది.
సీరియస్ యాక్షన్..
‘‘ఈ క్లిప్‌ను ఎవరు క్రియేట్ చేశారో, ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడానికి మా టీమ్ కష్టపడుతుంది. ఆపై వెంటనే బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్‌ను, జియో సినిమా కంటెంట్‌ను ఇలా మార్చినందుకు వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం’’ అని ప్రకటించింది జియో సినిమా. కానీ అప్పటికే ఈ వీడియో తెగ వైరల్ అవ్వడంతో శివసేన సెక్రటరీ అయిన ఎమ్మెల్యే డాక్టర్ మనీషా కాయాండే.. దీనిపై స్పందించారు. బిగ్ బాస్ ఓటీటీపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముంబాయ్ పోలీస్ కమీషనర్ వివేక్ ఫన్సల్కార్‌కు ఫిర్యాదు చేశారు. యూత్‌పై ఇలాంటి కంటెంట్ చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు.
మొదటినుంచి కాంట్రవర్సీలే..
ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ 3లో బాగా వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్‌లో అర్మాన్ మాలిక్ కూడా ఒకరు. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అర్మాన్.. పాయల్ మాలిక్, క్రితికా మాలిక్ ఇద్దరినీ పెళ్లి చేసుకున్నానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా కాంట్రవర్సీలకు దారితీసింది. ఇక తాజాగా తన రెండో భార్య క్రితికాతో తను రొమాన్స్ చేస్తున్నట్టుగా బయటికొచ్చిన వీడియోతో మరోసారి అర్మాన్ మాలిక్ పేరు సెన్సేషన్‌గా మారింది.