బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో వారం ఎలిమినేషన్ పూర్తయ్యి.. అయిదో వారంలోకి ఎంటర్ అయ్యారు కంటెస్టెంట్స్. నాలుగో వారంలో అనూహ్యంగా రతిక.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయింది. ఆ వెంటనే నామినేషన్స్ జరిగాయి. ఈసారి నామినేషన్స్‌లో హౌజ్‌మేట్ నుండి కంటెస్టెంట్‌గా మారిన శివాజీతో పాటు మరో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. పైగా నామినేషన్స్ పూర్తవ్వగానే.. అందులో ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు అనే విషయాన్ని గెస్ చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో పలు అనూహ్య ఎలిమినేషన్స్ జరగగా.. అయిదో వారం ఎలిమినేషన్ గురించి అప్పుడే ప్రేక్షకులు అంచనాలు వేయడం మొదలుపెట్టేశారు.


నామినేషన్స్‌లో ఆ ఏడుగురు..
బిగ్ బాస్ సీజన్ 7లోని అయిదో వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రిన్స్ యావర్, ప్రియాంక, టేస్టీ తేజ, శివాజీ, శుభశ్రీ, అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ ఆ లిస్ట్‌లో ఉన్నారు. కేవలం సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ మాత్రమే అయిదో వారం నామినేషన్స్‌లో లేరు. అది కూడా వారి దగ్గర పవర్ అస్త్రాలు ఉన్నాయి కాబట్టి వారు సేవ్ అయినట్టు తెలుస్తోంది. వారాలు గడుస్తున్నకొద్దీ కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు పెరిగిపోతున్నాయని, ఈవారం జరిగిన నామినేషన్స్ చూస్తే అర్థమవుతోంది. రెండు వారాలుగా పవర్ అస్త్రాతో సేవ్ అయిపోయిన శివాజీని టార్గెట్ చేస్తూ చాలామంది కంటెస్టెంట్స్ తనను నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్స్ వల్ల బిగ్ బాస్‌లో తన జర్నీ ముగిసిపోనుందని వార్తలు వస్తున్నాయి.


శివాజీకి గండం..
సీనియర్ నటుడు శివాజీ.. బిగ్ బాస్‌కంటే ముందు నుండే చాలామంది ప్రేక్షకులకు తెలుసు. ప్రస్తుతం అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు రెండిటికి సంబంధించిన ప్రేక్షకులకు బాగా దగ్గరయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ మాత్రమే. అయితే శివాజీ ముందు నుండే గేమ్‌ను ఒక స్ట్రాటజీతో ఆడుతున్నారని చాలామంది ప్రేక్షకులు భావించారు. పైగా ఎంటర్‌టైన్మెంట్ విషయంలో, టాస్కులలో సమయస్పూర్తిని ప్రదర్శించే విషయంలో శివాజీ ముందున్నాడు. కానీ కొందరు కంటెస్టెంట్స్‌కు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ, పక్షపాతంగా వ్యవహరించడం వల్ల శివాజీపై నెగిటివిటీ ఎక్కువయిపోయింది. అంతే కాకుండా తాను ఏం చేసినా కరెక్ట్ అనుకునే మనస్థత్వం కేవలం కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా నచ్చలేదు.


వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడో..
రెండు వారాల తర్వాత నామినేషన్స్‌లోకి వచ్చాడు కాబట్టి ప్రేక్షకులు కూడా శివాజీ చేసిన తప్పు ఒప్పులను లెక్కించి తనను ఎలిమినేట్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. పైగా ఇప్పటికీ నాలుగు ఎలిమినేషన్స్ అయిపోయినా కూడా ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేకపోవడంపై ప్రేక్షకుల్లో సందేహాలు మొదలవుతున్నాయి. ఎప్పటికైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలిసినా.. అవి ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే సీరియల్ హీరో అర్జున్ అంబటితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కంటెస్టెంట్స్‌గా రానున్నారని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వీరి ఫ్యాన్స్ సైతం ఎప్పుడెప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు.


Also Read: ఒక్కొక్క కంటెస్టెంట్‌కు నాలుగైదు పీఆర్ ఏజెన్సీలు ఉన్నాయి - ‘బిగ్ బాస్’పై దామిని షాకింగ్ కామెంట్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial