బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఆదివారం ఎపిసోడ్ తో ముగియనుంది. టాప్ 5లో ఉన్న సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, సిరి, మానస్ లలో విజేతగా ఎవరు గెలుస్తారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. విన్నర్ ని అనౌన్స్ చేయబోయే ఈ ఫినాలే ఎపిసోడ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఆదివారం నాటి ఎపిసోడ్ కి ఇండస్ట్రీ నుంచి పేరున్న సెలబ్రిటీలను తీసుకురానున్నారు. రణబీర్, అలియాభట్ లాంటి బాలీవుడ్ స్టార్లు ఈ స్టేజ్ పై గెస్ట్ లుగా కనిపించబోతున్నారని సమాచారం. 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వారు బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ లో కనిపించబోతున్నారు.
వారితో పాటు 'బ్రహ్మాస్త్ర' సినిమాను సౌత్ లో సమర్పిస్తోన్న రాజమౌళి కూడా బిగ్ బాస్ షోకి గెస్ట్ గా రాబోతున్నారు. ఇప్పుడు ఈ గెస్ట్ లిస్ట్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని.. ఇద్దరు బ్యూటీస్ సాయి పల్లవి, కృతిశెట్టిలతో కలిసి బిగ్ బాస్ షోకి గెస్ట్ గా రాబోతున్నారట. గతంలో నాని బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా వ్యవహరించారు. నిజానికి నానిని హోస్ట్ గా తదుపరి సీజన్లకు కూడా కంటిన్యూ చేయాలనుకున్నారు. కానీ సీజన్ 2 హోస్ట్ చేస్తోన్న సమయంలో నాని విపరీతమైన ట్రోలింగ్ ని ఎదురుకోవాల్సి వచ్చింది.
అందుకే ఇక జన్మలో బిగ్ బాస్ జోలికి వెళ్లనంటూ చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇప్పుడు తను నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాను ప్రమోట్ చేయడానికి మాత్రం బిగ్ బాస్ షోకి గెస్ట్ గా వస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబృందం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతోంది. రీసెంట్ గా వరంగల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి అభిమానులు భారీ స్థాయిలో అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో నాని సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఎంతో నమ్మకంగా మాట్లాడారు. ఇప్పుడు సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేకి అతిథిగా రాబోతున్నారు. నానిని మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పై చూసి ప్రేక్షకులు ఎగ్జైట్ అవ్వడం ఖాయం.
Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు
Also Read: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి