'బిగ్ బాస్'... 'బిగ్ బాస్'... 'బిగ్ బాస్'... షో చివరకు వచ్చేయడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో దీని ఫీవర్ ఎక్కువ ఉంది. హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, సన్నీ, శ్రీ రామచంద్ర, మానస్ నాగులపల్లి ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారు? - ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న ఇదే. విజేత ఎవరో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంది. అందుకే, కింగ్ అక్కినేని నాగార్జునకు కూడా 'బిగ్ బాస్' విన్నర్ గురించి ప్రశ్న ఎదురైంది.


బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున కీలక పాత్రలో నటించారు. తెలుగులోనూ ఆ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం 'బ్రహ్మాస్త్ర' తెలుగు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 'బిగ్ బాస్' సీజన్ 5 గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఉండటంతో షో హోస్ట్ నాగార్జున మిగతా సెలబ్రిటీల కంటే కొంత త్వరగా ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారు. 'బిగ్ బాస్' షూటింగుకు వెళ్లే ముందు ఆయనకు 'విన్నర్ ఎవరు?' అనే ప్రశ్న ఎదురైంది. నాగార్జున చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. 'మీరు ఎవర్ని గెలిపిస్తే వారు' అని నవ్వేశారు. అదీ సంగతి. 






Also Read: టెర్మినేటర్ హీరో ఆర్నాల్డ్‌తో బిగ్‌బాస్ విన్నర్
Also Read: మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య, రుద్రాణితో డాక్టర్ బాబు ఛాలెంజ్, అర్థరాత్రి పిల్లల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్ ను చూసి కంగారు పడిన దీప, కార్తీకదీపం డిసెంబరు 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!
Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి