బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో ప్రతీ కంటెస్టెంట్.. ఒంటరిగా ఆడడానికే వస్తారు. కానీ ప్రయాణంలో వారికి కచ్చితంగా ఇతర కంటెస్టెంట్స్ తోడు అవసరం అవుతుంది. అందుకే బిగ్ బాస్‌లో ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్ ఎక్కువ. అలా గ్రూపుల్లాగా ఫార్మ్ అయిన తర్వాత ఎవరి ఫ్రెండ్స్‌కు వారే సపోర్ట్ చేసుకోవడం మొదలుపెడతారు. బిగ్ బాస్.. ఒకవేళ సీక్రెట్ అని చెప్పినా కూడా అది కచ్చితంగా వారి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. అంతే కాకుండా కలిసి టాస్కులు కూడా ఆడడం మొదలుపెడతారు. తాజాగా శోభా శెట్టి కూడా అదే చేసింది. తనకు ఇచ్చిన పవర్ అస్త్రా టాస్క్ గురించి సందీప్‌కు లీక్ చేసింది. దీంతో గౌతమ్‌కు అన్యాయం జరిగినట్టు అనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియో.. తాజాగా బిగ్ బాస్ బజ్‌లో విడుదలయ్యింది.


కంటెండర్స్ అవ్వడానికి కంటెస్టెంట్స్ మధ్య పోటీ


మూడో పవర్ అస్త్రా కోసం పోటీకి శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్‌ను నేరుగా ఎంపిక చేశారు బిగ్ బాస్. దీంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ ప్రకటించిన ఈ నిర్ణయానికి సంతోషంగా లేరు. అందుకే ప్రతీ కంటెస్టెంట్.. ఈ ముగ్గురిలో ఎవరు అనర్హులు అంటూ కారణాలు బయటపెట్టారు. దీంతో ఈ ముగ్గురికి, మిగిలిన కంటెస్టెంట్స్‌కు మధ్య పోటీ మొదలయ్యింది. ముందుగా ప్రిన్స్ యావర్‌ను అనర్హులు అని చెప్పిన దామినికి, రతికకు, తేజకు.. ప్రిన్స్ యావర్‌కు మధ్య పోటీ మొదలయ్యింది. స్టాండ్ బైలో నిలబడిన యావర్‌ను ఈ ముగ్గురు కదిలించే ప్రయత్నం చేస్తే.. ఆ ముగ్గురు గెలిచినట్టు, యావర్ ఓడినట్టు. కానీ యావర్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వారు ఎంత టార్చర్ పెట్టినా కూడా కదలకుండా స్టాండ్ బైలో నిలబడి ఉన్నాడు. కాబట్టి యావర్‌కు పవర్ అస్త్రా కోసం కంటెండర్‌షిప్ కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు శోభా శెట్టి, అమర్‌దీప్ టర్న్ వచ్చింది.


చికెన్ ముక్కల టాస్క్


శోభా శెట్టిని అనర్హురాలు అంటూ పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ తమ అభిప్రాయాలు బయటపెట్టారు. దీంతో శోభా.. టాస్క్‌లో ఓడిపోతే.. ఆ కంటెండర్‌షిప్.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి చేతికి వెళ్తుంది. అయితే పవర్ అస్త్రా కోసం పోటీలో శోభా శెట్టి.. కారంగా ఉండే చికెన్ ముక్కలు తినాల్సి ఉంటుంది. తనకు ఎంత కష్టంగా ఉన్నా.. దాదాపు 37 చికెన్ ముక్కలను సక్సెస్‌ఫుల్‌గా తినగలిగింది శోభా. దీంతో పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ.. ఈ ముగ్గురిలో ఎవరు తనకంటే ఎక్కువ చికెన్ ముక్కలు తింటే.. పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ శోభా చేతినుండి జారిపోతోంది. 


వాళ్లు తినగలరేమో


పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ కోసం శోభా శెట్టి.. టాస్క్ ఆడి వచ్చిన తర్వాత ప్రియాంకతో అసలు టాస్క్ ఏంటి, తను ఎలా ఆడింది అన్న విషయం బయటపెట్టింది. తను 27 చికెన్ ముక్కలు తిన్నానని కేవలం ప్రియాంకకు మాత్రమే చెప్పింది. 45 చికెన్ ముక్కల్లో శోభా కేవలం 27 మాత్రమే తినగలిగింది. ఈ సందర్భంగా శోభా శెట్టి సందీప్‌తో మాట్లాడుతూ..  శుభశ్రీ, గౌతమ్, ప్రశాంత్.. ఎంత తినగలరు అని చర్చలు మొదలుపెట్టింది. సందీప్ అయితే గౌతమ్ తినగలడు అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. శోభా అయితే ప్రశాంత్ తినగలడంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. తను అసలు కారం తినదు కాబట్టి.. తనకు చాలా స్పైసీ అనిపించిందని, కానీ మిగతా వాళ్లకు అలా అనిపించకపోవచ్చని శోభా చెప్పింది. ఈ వీడియో చూసిన తర్వాత గౌతమ్.. పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ పోటీలో ఓడిపోవడానికి శోభా శెట్టి, సందీప్ కారణం అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే శోభా ఎక్కడా తనకు ఫేవర్ చేయమని సందీప్‌ను అడగలేదు. అయితే, వీరు మంచి ఫ్రెండ్స్ కావడంతో సందీప్ ఆమెకు ఫేవర్ చేసేందుకు గౌతమ్‌ను అనర్హుడిగా ప్రకటిించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూసిన ప్రేక్షకులు ఆ అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా గౌతమ్‌కు అనుకూలంగా ఉన్నాయి. శోభా చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ.. టైమ్ తీసుకుని చికెన్ పీస్‌లు తిన్నాదని, కానీ మిగతా ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రం చాలా ఈజీగా తక్కువ సమయంలోనే చికెన్ ముక్కలు తినేశారని అంటున్నారు. చెప్పాలంటే శోభ కంటే వారే ఆ టాస్క్‌కు తగిన కంటెస్టెంట్లని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Also Read: 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial