Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎంత ఫ్రెండ్స్ అయినా.. ఒకరికొకరు ఎంత హెల్ప్ చేసుకున్న పలు సందర్భాల్లో మాత్రం ఎవరి ఆట వారే ఆడాల్సి ఉంటుంది, ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దానివల్ల ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కూడా శత్రువుల్లాగా మారిపోతుంటారు. ఫినాలే అస్త్రా టాస్కులో ఇతర కంటెస్టెంట్స్‌తో పోటీపడలేక ప్రియాంక.. ఓడిపోయి రేసు నుంచి తప్పుకుంది. తప్పుకునే ముందు గౌతమ్‌కు తన పాయింట్స్‌లో సగం ఇచ్చేసింది. ఈ విషయం అమర్‌దీప్‌కు నచ్చలేదు. ఇదే విషయంపై శోభా, అమర్.. ప్రియాంకను మాటలతో హింసించారు. నిన్న జరిగిన విషయం ఈరోజు మర్చిపోతారని అనుకుంటే.. నవంబర్ 30న ప్రసారమయిన ఎపిసోడ్‌లో కూడా శోభా, అమర్ సందర్భం దొరికినప్పుడల్లా ప్రియాంకను ఇన్‌డైరెక్ట్‌గా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. దీని నుంచి తప్పించుకోవడం కోసం గౌతమ్‌ను సాయం కోరింది ప్రియాంక.
ప్రియాంక బ్రెయిన్ తిన్న అమర్..
ప్రియాంక.. గౌతమ్‌కు పాయింట్స్ ఇచ్చిన తర్వాత కాసేపు తనతో గొడవపడిన అమర్.. తినేటప్పుడు వచ్చి తన పక్కన కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘నాకు అర్జున్ ఒక్కడే ఉండేవాడు టార్గెట్‌గా. పోల్చుకుంటూ ముందుకు వెళ్లిపోయా. ఇప్పుడు సడెన్‌గా ఇంకొకడు ముందుకొచ్చాడు. ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. చేతులారా తీసుకొచ్చి ఇచ్చినట్టు అయ్యింది అక్కడ. ఎవరికి పనికొస్తాయో వారికి ఇవ్వాలి. నేను చెప్పేది అదే. నా బాధ అంతే. వెనక్కి లాగేసిన వాళ్ల దగ్గరకు వెళ్లి ఇచ్చి కృతజ్ఞత అంటే ఎలా? వాళ్లు అంత బాగా నామినేషన్స్‌లో కూడా మొహం మీద చెప్తున్నారు. దిగేటప్పుడు శోభా ఎలా ఇచ్చిందో.. అలా నువ్వు కూడా వీడు నా ఫ్రెండ్. వీడికి ఇస్తే ముందుకు వెళ్తాడు అని మామూలుగా సపోర్ట్ ఆశిస్తాను కదా. తప్పుడు నిర్ణయం తీసుకున్నావనే నా బాధ. నేను చాలా గుడ్డి నమ్మకంలో ఉన్నాను’’ అని చెప్పిందే చెప్తూ కాసేపు ప్రియాంక బ్రెయిన్ తిన్నాడు అమర్.
గౌతమ్‌కు ప్రియాంక రిక్వెస్ట్..
అమర్ ప్రవర్తనను తట్టుకోలేని ప్రియాంక.. వెళ్లి గౌతమ్‌తో పాయింట్ల గురించి మాట్లాడింది. ‘‘నువ్వు తగ్గిపోవాలని నాకు లేదు. ఛాన్స్ వస్తే అమర్‌కు ఇచ్చేయ్. ఒకవేళ కోర్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఆలోచించు. ఒకవేళ కొంచెం అయినా ఛాన్స్ ఉండి పాయింట్స్ ఇవ్వాల్సి వస్తే ప్లీజ్’’ అంటూ అమర్ కోసం తను రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ‘‘ఇవ్వాల్సిన పరిస్థితి రానివ్వను’’ అంటూ ధైర్యంగా సమాధానమిచ్చాడు గౌతమ్. ‘‘రావద్దు. కానీ వస్తే మాత్రం ఇవ్వు ప్లీజ్. అలా చేస్తే అది ఎప్పటికీ మర్చిపోను’’ అని గౌతమ్‌ను ఒప్పించే ప్రయత్నం చేసింది ప్రియాంక. ఆ పరిస్థితుల్లో గౌతమ్ కూడా ఎక్కువ మాట్లాడలేక సరే అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత శివాజీ కూడా అమర్ దగ్గరకు వచ్చి ఇదే మాట్లాడాడు. ప్రియాంక తనకు ఎందుకు పాయింట్లు ఇవ్వలేదని అడిగాడు. కెప్టెన్ చేశాడని కృతజ్ఞత చూపించిందంట అంటూ మళ్లీ చెప్పిందే చెప్పడం మొదలుపెట్టాడు అమర్. ఇతర కంటెస్టెంట్స్‌తో ఈ విషయం గురించి మాట్లాడడమే కాకుండా తనతో తాను కూడా ప్రియాంకను చాలాసార్లు తిట్టుకున్నాడు. తాజా ప్రోమో ప్రకారం.. గౌతమ్ ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఫినాలే రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి పాయింట్స్‌ను అమర్, అర్జున్, పల్లవి ప్రశాంత్‌లో ఒకరికి ఇవ్వాలి. ఈ నేపథ్యంలో గౌతమ్ ప్రియాంక ఇచ్చిన మాటకు కట్టుబడి అమర్‌కు తన పాయింట్స్‌ను ఇస్తాడా లేదా అర్జున్‌కు ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఒక రకంగా గౌతమ్‌కు ఇది అగ్నిపరీక్షే.
పదేపదే మాటలతో హింస..
ఇవన్నీ చూసి తట్టుకోలేని ప్రియాంక.. నేరుగా అమర్‌తోనే తేల్చుకుందామని ఫిక్స్ అయ్యింది. ‘‘నీ బాధ తప్పు కాదు. కానీ నువ్వు, శోభా కలిసి రోజంతా అదే చేస్తున్నారు’’ అని ప్రియాంక వాపోయింది. ‘‘చివరికి వచ్చాము. మన వాళ్లు మన పక్కన నిలబడకపోతే ఎలా? ఆరోజు నీ పాయింట్స్ కూడా కలిసి ఉండుంటే నన్ను ముట్టుకోవడం అసాధ్యంగా మారేది. ఇప్పుడు నాకు చాలా బోర్డర్‌లో ఉంది’’ అంటూ డైలాగులు కొట్టాడు అమర్. ‘‘అదంతా నాకు తెలుసు కానీ ఒకే మాటను నేను ఎన్నిసార్లు వినగలను అది ఆలోచించు. నాకు బాధగా ఉండదా. వింటూనే ఉన్నాను’’ అని ప్రియాంక బాధపడుతుండగా.. ‘‘వినేదానివి నీకే అంత బాధ ఉంటే నా ఫ్రెండ్ నాకు ఇవ్వలేదని నాకు ఎంత బాధ ఉండాలి’’ అని కౌంటర్ ఇచ్చాడు అమర్. అయితే ఇలాగే చెప్తూ ఉండు అని నిస్సహాయంగా చెప్పింది ప్రియాంక. ఆ తర్వాత అమర్ ప్రవర్తన కరెక్ట్‌గా లేదని శోభాతో చెప్పుకొని బాధపడింది. యావర్, ప్రియాంక.. ఇద్దరూ తనకే పాయింట్స్ ఇస్తారని అమర్ ఫిక్స్ అయ్యాడని, అలా జరగకపోవడంతో ఫీల్ అయ్యాడని అమర్‌కే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది శోభా. మొత్తంగా ఈ స్పా బ్యాచ్ మధ్య పాయింట్ల గొడవ ఎప్పటికీ ముగుస్తుందో అని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.
Also Read: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply