Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రా ఎవరు గెలుచుకుంటారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒక పాయింట్స్ టేబుల్‌ను ఏర్పాటు చేసి ఒకటి తర్వాత ఒకటిగా ఛాలెంజ్‌లు పెట్టుకుంటూ వెళ్తుండడంతో కొన్ని ఛాలెంజ్‌ల తర్వాత ఆ పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌లో ఎవరు ఉంటున్నారో వారు తప్పుకుంటూ ఉంటున్నారు. అలా ఇప్పటికే శివాజీ, శోభా, ప్రియాంక ఫినాలే అస్త్రా టాస్క్ నుండి తప్పుకున్నారు. ఇక నేడు జరగనున్న ఎపిసోడ్‌లో యావర్ కూడా తప్పుకొని తన పాయింట్స్‌ను ప్రశాంత్‌కు ఇస్తున్నట్టుగా చూపించారు. ఇక మిగిలిన నలుగురి మధ్య ఏ ఛాలెంజ్ జరిగింది, వారు ఎలా పాల్గొన్నారు అనేది మరో ప్రోమోలో చూపించింది బిగ్ బాస్ టీమ్.


పోటాపోటీగా అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్..
‘ఫినాలే రేసులో ఉన్న మీ నలుగురి సెన్సెస్ పరీక్షించడం కోసం బిగ్ బాస్ ఇస్తున్న ఎనిమిదవ ఛాలెంజ్ పట్టుకో తెలుసుకో’ అని బిగ్ బాస్ ప్రకటించారు. ఇక ఈ ఛాలెంజ్‌లో అర్జున్, గౌతమ్, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ కళ్లకు గంతలు కట్టేసి ఉంటాయి. వారి ముందు ఉన్న బాక్సుల్లో సంచాలకులు ఒక్కొక్క ఐటెమ్ పెడుతూ ఉంటారు. బజర్ మోగిన ప్రతీసారి ఆ వస్తువును పట్టుకొని అదేంటో గెస్ చేసి బిగ్ బాస్‌కు చెప్పాలి. అయితే దాదాపు అన్ని గేమ్స్‌లో చురుగ్గా పాల్గొని ముందు ఉన్న అర్జున్.. ఈ గేమ్‌లో మాత్రం వెనకబడిపోయాడు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు మాత్రం పోటాపోటీగా ఆడారు. పలు సందర్భాల్లో నేను ముందు చెప్పాను అంటే నేను ముందు చెప్పాను అంటూ గొడవపడ్డారు కూడా. సంచాలకురాలిగా అదంతా చూస్తున్న శోభా.. ‘‘మీరిద్దరు డిసైడ్ అయ్యి ఎవరు విన్నరో చెప్తే నేను బిగ్ బాస్‌కు చెప్తాను’ అంటూ వారి మీద అరిచింది.


పాపం అర్జున్..
ఇక అమర్, ప్రశాంత్‌లు మాత్రమే పాయింట్స్ అన్నీ సాధించుకుంటూ ఉండడంతో అర్జున్.. ‘‘బిగ్ బాస్ నేను కూడా ఈ రౌండ్ అక్కడ కూర్చొని చూస్తాను’’ అంటూ ధీనంగా అడిగాడు. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ గెస్ చేయడం కోసం చికెన్‌ను పంపించారు బిగ్ బాస్. వారు గెస్ చేసిన తర్వాత శోభా.. అవన్నీ తీసుకొని ‘చికెన్ ఉంచుకుందామా’ అని యావర్‌ను అడిగింది. అది విన్న బిగ్ బాస్.. ‘‘శోభా చికెన్‌ను తీసుకోండి. మా ప్లేట్స్‌ను పంపించండి’’ అంటూ కామెడీ చేశారు. ప్రతీ వస్తువును అమరే ముందుగా కరెక్ట్‌గా గెస్ చేయడంతో యావర్‌కు అనుమానం వచ్చింది.


అమర్‌పై యావర్ అనుమానం..
టాస్క్ అయిపోయిన తర్వాత అమర్ కళ్లకు కట్టుకున్న గంతలను తీసుకొని పరీక్షించాడు యావర్. అది గమనించిన శివాజీ.. యావర్ దగ్గరకు వెళ్లి ‘‘కనిపిస్తుందా’’ అని అడిగాడు. 100 శాతం కనిపిస్తుంది అని యావర్ సమాధానమిచ్చాడు. అదంతా అమర్ చూస్తూనే ఉన్నాడు. ‘‘నేను ఆడితేనే వస్తాయి ఇలాంటి డౌట్స్ అన్నీ. నిజంగా గెలిస్తేనే వస్తాయి. వేరేవాళ్లు ఆడితే రావు. వేరేవాళ్ల గెలుపు అయితే మాత్రం చంకలు గుద్దుకుంటారు. నాది అయితే మాత్రం డౌట్లు’’ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అమర్‌దీప్.



Also Read: అర్జున్ గెలవకుండా యావర్ కుట్ర? చివరికి అతడికే ఎఫెక్ట్? ఫినాలే అస్త్రాలో పాలిటిక్స్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply