బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ అంతా ఫినాలే అస్త్రా కోసం పోటీపడడం మొదలుపెట్టారు. కానీ కొందరికి లక్ కలిసి రాక, మరికొందరు కంటెస్టెంట్స్‌కు ఇతర కంటెస్టెంట్స్ సపోర్ట్ దొరకక ఆగపోవాల్సి వచ్చింది. అలా ఇప్పటికే ఫినాలే అస్త్రా రేసు నుంచి శివాజీ, శోభా, ప్రియాంక తప్పుకున్నారు. ముందుగా తప్పుకోవాల్సి వచ్చిన శివాజీ, శోభా.. తమ పాయింట్స్‌ను అమర్‌కు ఇచ్చేశారు. ఆ తర్వాత తప్పుకున్న ప్రియాంక.. అప్పటికీ పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌లో ఉన్న గౌతమ్‌కు తన సగం పాయింట్స్ ఇచ్చేసింది. దీంతో రేసులో ప్రస్తుతం అమర్‌దీప్, అర్జున్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, యావర్ మాత్రమే మిగిలారు. టాస్క్ తర్వాత అందులో నుంచి కూడా ఒకరు తప్పుకున్నట్టు ప్రోమోలో చూపించారు.


తప్పించుకో రాజా..
ఫినాలే అస్త్రా కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఏడవ ఛాలెంజ్ ‘తప్పించుకో రాజా’. ఈ ఛాలెంజ్‌లో అయిదుగురు కంటెస్టెంట్స్ ఖైదీలుగా డ్రెస్సులు వేసుకొని జైలు నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. తప్పించుకోవడం కోసం ముందుగా వారు వారికి ఏర్పాటు చేసిన టనెల్‌లోని ఇసుకను తవ్వుతూ అందులో నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి కాలికి ఉన్న తాళానికి సంబంధించిన తాళంచెవిని వెతికి దానిని ఓపెన్ చేసి విడిపించుకొని వెళ్లి గంట కొట్టాల్సి ఉంటుంది. అలా ముందుగా ఎవరు కొడతారో వారికే ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. అయితే ఇప్పటివరకు దాదాపు ప్రతీ ఆటలో ముందుగా ఉన్న అర్జున్.. దీంట్లో మాత్రం వెనకబడ్డాడు. అందరికంటే ముందుగా పల్లవి ప్రశాంత్.. అందులో నుంచి బయటపడి గంట కొట్టి టాస్క్‌ను ముగించాడు.


ఒకరి తప్పు వల్ల మరొకరి గేమ్ ఫెయిల్..
యావర్, అర్జున్, అమర్.. అందరూ దాదాపుగా ఒకేసారి ఆ టనెల్ నుంచి బయటికి వచ్చినా.. తాళంచెవులు వెతుక్కునే క్రమంలో కొందరికి కాస్త లేట్ అయ్యింది. అయితే తాళంచెవి వెతికే క్రమంలో ఎక్కడ తీసిన కీని అక్కడే పెట్టాలని సంచాలకులు చెప్పినా.. కంటెస్టెంట్స్ వినలేదు. దీంతో అర్జున్ గేమ్‌పై ఎఫెక్ట్ పడింది. అందుకే కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అందరికంటే చివరిగా అర్జునే టాస్క్ పూర్తిచేశాడు. అయితే అర్జున్ చెప్పినదాంట్లో పాయింట్ ఉందని శివాజీ కూడా ఒప్పుకున్నాడు. అలా చేసింది యావరే అని శోభా.. ప్రియాంకతో చెప్పింది. ఆ విషయం అర్జున్‌కు కూడా తెలుసు అని ప్రియాంక క్లారిటీ ఇచ్చింది.


ఆటలో ఓడిపోవడంతో యావర్ కన్నీళ్లు..
ఇక టాస్క్ బాగా ఆడినా కూడా పాయింట్స్ టేబుల్‌లో చివరిగా ఉండడంతో ఫినాలే అస్త్రా రేసు నుంచి యావర్ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ‘‘లక్ కలిసి రావడం లేదు’’ అంటూ అమర్‌తో చెప్పి బాధపడ్డాడు యావర్. ‘‘ఎప్పుడు, ఎవరికి, ఎలా కలిసొస్తుందో మనకు తెలియదు’’ అని అమర్ ఓదార్చబోయాడు. అయినా యావర్ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన పాయింట్స్‌లో నుంచి సగం పాయింట్స్ ఇంకొక కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆలోచించకుండా ప్రశాంత్ పేరు చెప్పాడు యావర్. ‘‘నీకు బాగా కలిసొచ్చింది. మార్కులు, సంచాలకులు’’ అంటూ అమర్‌తో సీరియస్‌గా అన్నాడు అర్జున్. ‘‘అసలైంది కలిసి రాలేదు’’ అని అమర్ అసంతృప్తిగా చెప్పాడు. ఆ మాట విన్న అర్జున్‌కు కోపమొచ్చింది. అయినా కూడా సీరియస్ అవ్వకుండా ‘‘నీకు ఇచ్చి మేము కాఫీ తాగి వెళ్లిపోతాం’’ అంటూ నవ్వకుండానే కామెడీ చేశాడు.



Also Read: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply