బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్‌పై కూడా నెగిటివిటీ వస్తున్నా.. ఫీమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఒకరు తర్వాత ఒకరుగా వెళ్లిపోతున్నారు. అలా ఇప్పటికీ గడిచిన ఆరు వారాల్లో ఆరుగురు లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ ఆరో వారంలో కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఒక అమ్మాయి పేరు వినిపించగా.. ఇప్పుడు కొత్తగా మరో అమ్మాయి ఎలిమినేట్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఫెయిల్..
బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ముగ్గురు అమ్మాయిలు హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. కానీ వీరు అడుగుపెట్టిన మొదటి వారం నుండే అందరిపై ప్రేక్షకుల్లో అంత పాజిటివ్ ఇంప్రెషన్ ఏమీ ఏర్పడలేదు. అశ్విని శ్రీ అయితే వచ్చిన రెండోరోజే నామినేషన్స్‌లో ఏడుపు మొదలుపెట్టంది. పూజా మూర్తి అవసరం లేకపోయినా అరిచి పెత్తనం చూపించాలని అనుకుంటోంది. ఇక నయని పావని అందంగా రెడీ అయ్యి, మేకప్ వేసుకొని అటు ఇటు తిరిగితే చాలు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. అంతే కాకుండా యావర్‌లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌తో సావాసం చేస్తే తను హౌజ్‌లో ఎక్కువకాలం సేఫ్‌గా ఉండవచ్చు అనే ఆలోచనలు చేస్తోంది. కానీ నయని పావని ప్లాన్స్ అన్నీ రివర్స్ అయినట్టు అనిపిస్తోంది.
శోభా శెట్టి ఎలిమినేట్ అంటూ వార్తలు..
ముందుగా బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం ఎలిమినేట్ అయ్యేది శోభా శెట్టి అని ముందుగా వార్తలు వైరల్ అయ్యాయి. శోభా శెట్టి కూడా ఇతర కంటెస్టెంట్స్ మాట వినకుండా, అనవసరంగా అరుస్తూ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటోంది. అందుకే ప్రేక్షకుల్లో తన అభిప్రాయం కూడా మారిపోయింది. దీంతో శోభా కచ్చితంగా ఈ వారం బిగ్ బాస్ హౌజ్ వదిలి వెళ్లిపోతుంది అని ఫిక్స్ అయిపోయారు చాలామంది. కానీ అనూహ్యంగా నయని పావని ఎలిమినేట్ అయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభా శెట్టి తర్వాత అశ్విని శ్రీ ఓట్ల విషయంలో తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉందని సోషల్ మీడియా సమాచారం. కానీ ఉన్నట్టుండి ఈ లెక్కలు ఎలా మారాయో.. నయని పావని డేంజర్ జోన్‌లోకి వచ్చి ఎలిమినేట్ ఎలా అయ్యిందో అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యావర్ కెప్టెన్ అవ్వడానికి సాయం..
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది నయని పావని. అప్పటికే బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఉన్న కొందరు తనకు ముందు నుండే ఫ్రెండ్స్ అవ్వడంతో వెళ్లి వెంటనే వారి గ్యాంగ్‌లో జాయిన్ అయ్యింది. ప్రిన్స్ యావర్‌తో చనువుగా ఉంటూ తను బిగ్ బాస్ సీజన్ 7లో రెండో కెప్టెన్ అవ్వడానికి కూడా సాయం చేసింది. టాస్కుల్లో ఆడినప్పుడు తను గెలిచినా గెలవకపోయినా నేనే ఆడాను అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. ఇటీవల జరిగిన బాస్కెట్ బాల్ టాస్కులో కూడా అశ్వినిని కాకుండా నయని పావనిని ఎంపిక చేశారు. దీంతో అశ్విని కూడా నయనిపై విమర్శలు చేసింది. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు.. నయని పావనిని ఎలిమినేట్ చేసి ఉండవచ్చని అంచనా.
Also Read: బాలకృష్ణను కలిసినప్పుడు భయం ఉంది, కానీ ఆ తర్వాత - శ్రీలీల ఏం చెప్పారంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial