గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా 'భగవంత్ కేసరి'. ఇందులో బాలకృష్ణ జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. ఆయనకు కుమార్తెగా, విజ్జి పాత్రలో శ్రీ లీల (Sreeleela) నటించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో శ్రీ లీల ముచ్చటించారు. 


''నాకు 'భగవంత్ కేసరి' కథ చాలా నచ్చింది. గ్లామర్ రోల్స్ చేసే సినిమాలు చాలా ఉంటాయి. అయితే... ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం ఉన్న చిత్రమిది. కొంత కాలం తర్వాత ఇటువంటి పాత్ర చేయలేను. శ్రీ లీల అంటే డ్యాన్స్ అని ప్రేక్షకుల మనసులో ముద్ర పడిపోయింది. పాజిటివ్ అంశమే అయినప్పటికీ... నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని నాకు కూడా ఉంటుంది. అటువంటి అవకాశం ఈ సినిమాతో నాకు దొరికింది''. 


బాలకృష్ణ గారిది పసి మనసు! 
''సినిమా ట్రైలర్ చూశారు కదా! అందులో నా ట్రైనింగ్ సీన్ ఉంది కదా! బాలకృష్ణ గారు, నా కాంబినేషన్లో మొదట షూట్ చేసిన సీన్ అదే! నేను పుష్ అప్స్ చేయాలి. కానీ, చేయలేకపోతుంటాను. ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారు. ఆ సీన్ చేసిన తర్వాత 'నిజంగా నీకు  పుష్ అప్స్ చేయడం రాదా?' అని బాలకృష్ణ గారు అడిగారు. అనిల్ రావిపూడి గారు అలా చేయమన్నారని చెప్పాను (నవ్వుతూ). నిజానికి, నేను ఆయనను మొదటి కలిసినప్పుడు నెర్వస్ ఫీలయ్యా. ఒక భయం వుంది. అయితే... మరుక్షణమే ఆ భయం పోయింది. నిజంగా ఆయనది పసి మనసు. చాలా స్వీట్. ఆయన మనసుకు తగ్గ పేరు పెట్టారు''. 


మెడిసిన్ మీద బాలకృష్ణ గారికి ఎంతో నాలెడ్జ్ ఉంది!
''బాలకృష్ణ గారికి సినిమాలు మాత్రమే కాకుండా... చాలా రంగాలపై నాలెడ్జ్ ఉంది. నేను మెడిసిన్ ఎగ్జామ్ రాసిన వచ్చా! ఆ విషయం చెప్పా. అందులోని చాప్టర్స్ గురించి ఎంతో లోతుగా మాట్లాడేవారు. 'ఆయన మెడిసిన్ చేయలేదు కదా! ఇదెలా తెలుసు' అని ఆశ్చర్యపోయేదాన్ని''


అనిల్ రావిపూడి డిఫరెన్స్ చూపించారు!
''అనిల్ రావిపూడి సార్ ఇంతకు ముందు తీసిన సినిమాలతో పోలిస్తే... 'భగవంత్ కేసరి' ప్రమోషనల్ మెటిరియల్ అన్నింట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే, హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు కూడా! ఇందులో విజ్జి పాత్ర చేశా. అది కూడా చాలా డిఫరెంట్. విజ్జి పాప భయపడే అమ్మాయి. అదే సమయంలో చలాకీగా ఉంటుంది''


Also Read : ఒకే చితిలో రెండు శవాలు, చేతబడితో మళ్ళీ వచ్చిన 'సత్యం' రాజేశ్


నటిగా నన్ను నేను పరీక్షించుకున్నా!
''నటిగా నన్ను నేను పరీక్షించుకున్న సినిమా ఇది. 'ఆడ పిల్ల లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా ఉండాలి' అని ఓ డైలాగ్ ఉంది. అది బిడ్డ కోసం హీరో పడే తపన. దానిని ప్రేక్షకులు సరిగా అర్థం చేసుకోవాలంటే నేను సరిగ్గా చేయాలి. ఆదృష్టిలో పెట్టుకుని సినిమా చేశా. ఇందులో ఫాదర్ డాటర్ బాండింగ్, ఆ ఎమోషన్స్ అనిల్ రావిపూడి చాలా అందంగా చూపించారు. నా రియల్ లైఫ్ చిచ్చా మా అమ్మ. తను చిన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండమని చిచ్చా లానే చెప్పేది. అందుకే ఈ కథతో చాలా కనెక్ట్ అయిపోయాను''


Also Read 'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ చూశారా? - రేపే ఫస్ట్ హై!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial