బిగ్ బాస్ సీజన్ 7లో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లులో ఎవరు బెస్ట్ అని తేలిపోయింది. ముందుగా పోటుగాళ్లు బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ గెలిచి సత్తాచాటుకున్నా తర్వాత వారి స్పీడ్‌ను అందుకుంటూ ఆటగాళ్లు కూడా ముందుకు దూసుకొచ్చారు. ఆ తర్వాత ఆటగాళ్లు కూడా బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ గెలిచారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన మొత్తం ఏడు గేమ్స్‌లో నాలుగు టాస్కులు ఆటగాళ్లే గెలిచి చూపించారు. దీంతో ఆటగాళ్ల టీమ్‌లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ కెప్టెన్సీ కోసం ఎంపికయ్యారు. కానీ అందులో ఎవరు కెప్టెన్ అనే విషయాన్ని పోటుగాళ్లు డిసైడ్ చేయగలరు అని బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇదే క్రమంలో టేస్టీ తేజపై మరోసారి నోరుపారేసుకుంది శోభా శెట్టి.
కెప్టెన్సీ కోసం గొడవలు..
కెప్టెన్సీ కంటెండర్లు అయిన ఎనిమిది మంది బెలూన్స్ కట్టుకొని లైన్‌గా నిలబడాలి. ఆ బెలూన్స్‌ను పగలగొట్టే పిన్ మాత్రం లివింగ్ రూమ్‌లో ఉంటుంది. బజర్ మోగగానే పోటుగాళ్లు టీమ్ నుండి ఎవరైతే ముందుగా ఆ పిన్‌ను తీసుకుంటారో.. వారు ఆటగాళ్లు టీమ్ నుండి ఒకరిని సెలక్ట్ చేసుకొని వారికి ఆ పిన్‌ను ఇవ్వాలి. అప్పుడు పిన్ అందుకున్న కంటెస్టెంట్.. ఎవరి బెలూన్‌ను అయినా పగలగొట్టి వారిని కెప్టెన్సీ రేసు నుండి తొలగించవచ్చు. పోటుగాళ్లు టీమ్ నుండి ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్కరికి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ముఖ్యంగా భోలే షావలి, అశ్విని శ్రీ మాత్రం పల్లవి ప్రశాంత్‌కే సపోర్ట్ చేయాలని అనుకున్నారు కానీ సందీప్ చేతికి పిన్ వచ్చిన వెంటనే తను ప్రశాంత్ బెలూన్‌ను పగలగొట్టి కెప్టెన్సీ రేసు నుండి తొలగించాడు. దాని వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది.
అమర్‌దీప్ గాలి తీసేసిన తేజ..
పోటుగాళ్లు టీమ్ నుండి గౌతమ్ వచ్చి పిన్‌ను యావర్‌కు ఇచ్చాడు. అప్పటికీ అమర్‌దీప్, శోభా, తేజ, తను కెప్టెన్సీ రేసులో మిగిలారు. దీంతో యావర్ వీక్ అనే కారణంతో శోభాను తొలగించాడు. దీంతో ఇది చిన్నపిల్లల ఆటలాగా ఉంది అని, నువ్వు నన్ను హర్ట్ చేశావు కాబట్టి నేను కూడా నిన్ను హర్ట్ చేస్తాను అన్నట్టుగా ఆడుతున్నారు అని పక్కకు వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తేజకు అవకాశం ఇచ్చాడు అర్జున్. దీంతో యావర్‌కు సపోర్ట్ చేయడం కోసం మిగిలిన అమర్‌దీప్ బెలూన్ పగలగొట్టాడు తేజ. అలా చేయడానికి ఏ కారణం లేదు అని చెప్పగానే శోభాకు విపరీతంగా కోపం వచ్చింది. ‘‘ఆడియన్స్ దృష్టిలో నువ్వు మంచివాడిని కావాలి అనుకుంటున్నావు. అది నీ సేఫ్ గేమ్’’ అంటూ మండిపడింది శోభా.
నయని వల్లే యావర్‌కు కెప్టెన్సీ..
కెప్టెన్సీ నుండి తొలగించినందుకు శోభా బాధపడుతుంటే యావర్ వచ్చి ఓదార్చాడు. ‘‘నీ నుండి నేను ఇది ఊహించలేదు’’ అంటూ ఏడ్చింది శోభా. ఇక కెప్టెన్సీ రేసులో చివరిగా తేజ, యావర్ మిగిలారు. లాస్ట్ రౌండ్‌లో ఆ పిన్ నయని చేతికి వెళ్లింది. దీంతో బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం తనే ఒకరిని కెప్టెన్‌గా డిసైడ్ చేయాలి. దీంతో తేజ బెలూన్‌ను పగలగొట్టి.. యావర్‌ను కెప్టెన్ చేసింది నయని. యావర్ కెప్టెన్ అయినందుకు శివాజీ ఫుల్ ఖుషీ అయిపోయాడు. దీంతో నయని వల్లే తను కెప్టెన్ అయిపోయాడు కాబట్టి తనతో సంతోషాన్ని పంచుకున్నాడు యావర్.
Also Read: ఏం చెప్పినా నమ్మేస్తాడు, మనుషులను హ్యాండిల్ చేయడం రాదు - అమర్ ప్రవర్తనపై భార్య తేజస్విని వ్యాఖ్యలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial