బిగ్ బాస్ సీజన్ 7లో ఆటగాళ్లు, పోటుగాళ్లు మధ్య పోటీ మొదలయ్యింది. అయితే బిగ్ బాస్.. రెండు టీమ్స్‌కు ఆరు టాస్కులు ఇస్తానని, అందులో ఎవరు గెలిస్తే వారే బిగ్ బాస్ హౌజ్‌లో బెస్ట్ టీమ్ అని ప్రకటిస్తానని బిగ్ బాస్ ముందే తెలిపారు. ముందుగా పోటుగాళ్లు బ్యాక్ టు బ్యాక్ టాస్కులు గెలిచినా.. ఆ తర్వాత ఆటగాళ్లు కూడా వారికి గట్టి పోటీనిచ్చి బ్యాక్ టు బ్యాక్ మూడు టాస్కులు గెలిచారు. దీంతో రెండు టీమ్స్ మధ్య టై అయ్యింది. టై బ్రేకర్‌గా మరో టాస్క్ పెట్టాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నట్టు తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అంతా ఫిజికల్‌గా ఒకరి మీద ఒకరు పడిపోయి, దెబ్బలు లెక్కచేయకుండా ఆడారు. 


ఎవరు బెస్ట్..?


‘‘ఆటగాళ్లు, పోటుగాళ్లు ఇరువురు మూడు టాస్కులు గెలిచి తమ సత్తా ఏంటో చాటుకున్నారు. మరి మీలో ఎవరు బెస్ట్ అని తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇస్తున్న ఫైనల్ టై బ్రేకర్ టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్’’ అని బిగ్ బాస్ తెలిపారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ మధ్య బాస్కెట్ బాల్ పోటీ పెట్టారు. ఏ టీమ్ అయితే ముందుగా బాల్ అందుకొని అవతలవైపు ఉన్న బాస్కెట్‌లో వేస్తుందో వారే విన్నర్. దీంతో రెండు టీమ్స్ సీరియస్ డిస్కషన్ మొదలుపెట్టాయి. ‘‘ఇది మనకు చాలా అవసరం’’ అని తన టీమ్‌మేట్స్‌తో చెప్పింది శోభా. ఇక పోటుగాళ్లు టీమ్‌లో ‘‘నేను ఫిజికల్ ఆడతాను’’ అంటూ పూజా ముందుకొచ్చింది. ‘‘తెలుస్తుందిలే ఫిజికల్ ఆడతావని’’ అని అశ్విని కాస్త వ్యంగ్యంగా మాట్లాడింది. ‘‘తెలుస్తుందిలే అంటే ఏంటి అర్థం’’ అని పూజా ప్రశ్నించింది.


గోల్ వేసిన ఆటగాళ్లు


ఇక టాస్క్ మొదలవ్వగానే రెండుసార్లు బజర్ మోగినప్పుడు ఆటగాళ్లు టీమ్ నుంచి యావరే బాల్‌ను ముందుగా పట్టుకున్నాడు. కానీ ఆ బాల్‌ను తన చేతిలో నుంచి తీసుకోవడానికి పోటుగాళ్లు టీమ్ విశ్వప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఆటగాళ్లే ఒక గోల్‌ను వేయగలిగారు. దీంతో పోటుగాళ్లు కాస్త నిరాశలో ఉంది. ఆట ముగిసిన తర్వాత పూజా, అశ్వినిల మధ్య వాగ్వాదం జరిగింది.


పూజా వర్సెస్ అశ్విని


‘‘నేను ఫిజికల్‌గా అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాను అని చెప్పాను కదా’’ అని పూజా గుర్తుచేసింది. ‘‘నన్ను చూస్తే నేను స్ట్రాంగ్ అని తెలియడం లేదా’’ అని ఎదురుప్రశ్న వేసింది అశ్విని. ‘‘అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా’’ అంటూ అశ్వినిపై సీరియస్ అయ్యింది పూజా. గట్టిగా మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పింది అశ్విని. ‘‘నా వరకు వస్తే నేను గట్టిగానే మాట్లాడతాను’’ అని కౌంటర్ ఇచ్చింది పూజా. ‘‘నీకు నోరు బాగా ఎక్కువ అని ఇక్కడ అందరికీ తెలిసిపోయిందిలే ఆల్రెడీ’’ అని మాటజారింది అశ్విని. దానికి ‘‘నోరు అదుపులో పెట్టుకో’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది పూజా. ‘‘నోరు మూసుకో. నువ్వు నాకు చెప్పకు. నేనెందుకు నోరు అదుపులో పెట్టుకోవాలి. నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడు.’’ అని చెప్పి అశ్విని అక్కడి నుంచి వెళ్లిపోతుండగా పూజా అడ్డుపడింది. ‘‘నేనేం అన్నాను’’ అని పూజాను ప్రశ్నించింది అశ్విని. ‘‘నాకు నోరు ఎక్కువ అని చెప్పడానికి నీకు ఏ హక్కు లేదు. నన్ను నోరు మూసుకో అని చెప్పడానికి నీకు ఏ హక్కు లేదు.’’ అని పూజా అరవడం మొదలుపెట్టింది. అయితే అశ్విని ‘‘వెరీ గుడ్, గ్రేట్ జాబ్, బాగా ఫైటింగ్’’ చేశావు అంటూ వ్యంగ్యంగా చప్పట్లు కొడుతూ చెప్పింది. ‘‘నీకు నాతో అలా మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు’’ అని పూజా చెప్తుండగానే నీకు కూడా అంటూ అశ్విని అక్కడ నుంచి వెళ్లిపోయింది. 


ఇక ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు ఛాలెంజ్‌లో దాదాపు అన్ని ఫిజికల్ టాస్కులలో చురుగ్గా ఆడి టీమ్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసిన యావర్.. బిగ్ బాస్ సీజన్ 7లో రెండో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. పవర్ అస్త్రా కోసం పోటీ పడిన సమయంలో ఎన్నోసార్లు తన చేతి నుండి అవకాశాలు జారిపోతూ వచ్చినా.. ఫైనల్‌గా కెప్టెన్సీని, దానితో పాటు వచ్చే ఇమ్యూనిటీని కూడా దక్కించుకున్నాడు యావర్.


Also Read: నేను అలసిపోయానంటూ బోరున ఏడ్చేసిన ప్రియాంక - ఫుడ్ గురించి వర్రీ అవుతోన్న బీబీ వంటలక్క!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial