Bigg Boss 6 Telugu: వీకెండ్లో నాగార్జున షో కోసం ఎదురు చూసే వారు ఎంతోమంది. ఈ వారం మరీ ఎదురుచూశారు. ఎందుకంటే ఇంటి సభ్యులు ఆట వరస్ట్ గా ఉండడంతో వారికి నాగ్ ఏ విధంగా క్లాస్ తీసుకుంటారో చూడాలన్నది వారి ఆశ. అయితే నాగార్జున అంత కటువుగా మాట్లాడలేదు కానీ, ఇంటి సభ్యుల పట్ల కాస్త కోపంగానే ఉన్నట్టు కనిపించారు. వారందరితో కాస్త పుల్ల విరుపుగానే మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ ఈ వారం బలైపోయాడు. అతడిని పదే పదే పప్పు పప్పు అంటూ నాగార్జున శిక్ష వేస్తూనే ఉన్నారు. రేవంత్‌ని సరిగా మాట్లాడనివ్వలేదు కూడా. ఇక రెండో ప్రోమోలో ఏముందంటే...
ఇనయా ఎందుకిలా మారింది?
కీర్తి ఒసేయ్ రాములమ్మలో విజయశాంతి క్యారెక్టర్ ఓ టాస్కులో భాగంగా చేసిన సంగతి తెలిసిందే. రాములమ్మ పాత్ర గురించి సూర్యనే కీర్తికి చెప్పి నటించేలా చేశాడు. అదే విషయాన్ని నాగార్జున మాట్లాడారు. ‘రాములమ్మ పాత్ర విషయంలో కీర్తికి సాయం చేసింది ఎవరు’ అని అడిగారు నాగార్జున. సూర్య అని చెప్పింది కీర్తి. మరి ఇనయాకు సూర్య ఎందుకు హెల్ప్ చేయలేదు అని అడిగారు నాగ్. దానికి ఇనయా ‘మీ టీమ్ వాళ్లెవరూ చెప్పలేదా నీకు’ అని సూర్య అన్నాడని చెప్పింది. దానికి నాగార్జున ‘అందుకేనా శ్రీహాన్‌ను పొగడడం మొదలుపెట్టావా?’ అని అడిగారు.
మోస్ట్ అన్‌డిజర్వింగ్ ఎవరు?
ఇంట్లో ఉండడానికి మోస్ట్ డిజర్వింగ్ ఎవరు అని అడిగితే ఇంటి సభ్యులు ఎవరు పేర్లు చెప్పారో ప్రోమోలో చూపించలేదు. కానీ ఎవరు ఇంట్లో అన్‌డిజర్వింగ్ అని అడిగితే మాత్రం ఎక్కువ మంది మెరీనా పేరు చెప్పారు. గీతూ అయితే ‘కలిసి ఆడమన్నప్పుడు విడివిడిగా ఆడారు, విడివిడి ఆడమంటే కలిసి ఆడుతున్నారు’ అంటూ చెప్పింది.
వాసంతి మాట్లాడుతూ వందశాతం కష్టపడ్డానని, అందుకే జైలుకు వెళ్లానని అంది. దానికి నాగార్జున జైలుకు వెళితే మోస్ట్ డిజర్వింగ్ అని నీ ఫీలింగా అని అడిగారు. దీంతో ప్రోమో ముగిసింది. ఈ వారం నిజం చెప్పాలంటే గీతూ కూడా పెద్దగా ఆడింది లేదు, ఆదిరెడ్డి కూడా ఆడింది లేదు. అయినా ఎందుకో వీరిద్దరి జోలికి పోరు నాగార్జున. ఈ వారం ఆడినవారిలో వాసంతి ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్ టాస్కులో పేలవగా ఆడింది. ఈమె మాత్రమే దాదాపు ఒకరిద్దరూ తప్ప అందరూ అలాగే ఉన్నారు. అయినా వాసంతి మాత్రమే టార్గెట్ అయింది. కాబట్టి ఈమె కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువే.
ఈ వారం నామినేషన్లలో గీతూ, సూర్య తప్ప అందరూ ఉన్నారు. అయితే ఈసారి డేంజర్ జోన్లో ఉన్నది ఇనయా, మెరీనా అని సమాచారం. వీరిద్దరిలో మెరీనాను ఎలిమినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇనయా ఉంటే ఎప్పుడోసారి కంటెంట్ వస్తుంది. మెరీనా వల్ల వచ్చే కంటెంట్ సున్నా అనే చెప్పాలి. ఆమె ఎలిమినేట్ అయినా పెద్దగా ఒరిగేదేమీ లేదు.
Also read: పప్పూ నువ్వు కూర్చో - రేవంత్‌కి నాగార్జున చేతిలో మూడినట్టే ఉంది ఈసారి