‘బిగ్ బాస్’లో హోస్ట్ నాగార్జున శనివారం కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ పీకారు. హౌస్‌లో సక్రమంగాలేనివారి తప్పులు చెబుతూ.. వారి ఫొటోలు ఉన్న జెండా కర్రలను విరిచేశారు. ముందుగా కెప్టెన్‌గా ఎంపికైన గౌతమ్‌కు అభినందనలు తెలిపిన నాగ్.. అతడు సంచాలకుడిగా వ్యవహరించిన ‘సింక్ - ఫ్లోట్’ టాస్క్‌లో అమర్ దీప్, టేస్టీ తేజల చీటింగ్‌ను కనిపెట్టకపోవడంపై ఫెయిల్ అయినట్లు నాగ్ తెలిపారు. 


శోభా, అమర్, ప్రియాంక బ్యాచ్‌కు ఫుల్ క్లాస్


కెప్టెన్ ఎంపిక సమయంలో యావర్, శోభా మధ్య జరిగిన గొడవపై నాగార్జున మాట్లాడారు. యావర్‌ను పిచ్చొడు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘లాస్ట్ టైమ్ భోలే ఎర్రగడ్డ అన్నాడని గింజుకున్నావు. మరి నువ్వు యావర్‌ను పిచ్చివాడు అనడం కరెక్టా’’ అని నాగ్ ప్రశ్నించారు. దీనికి శోభా స్పందిస్తూ.. ‘‘కెప్టెన్సీ నుంచి అన్‌డిజర్వ్ చేసేందుకు చెప్పిన కారణం నాకు నచ్చలేదు. ఆ సమయంలో యావర్ అలా బీహేవ్ చేయడాన్ని చూసి నేను పిచ్చోడు అన్నాను. అతడు నన్ను మళ్లీ మళ్లీ ట్రిగర్ చేయడం వల్ల అలా అనాల్సి వచ్చింది’’ అని తెలిపింది. నాగ్ మాట్లాడుతూ.. ‘‘నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు కదా’’ అని అన్నారు. 


నీ ప్రవర్తన చూస్తే జనాలు కూడా పిచ్చోళ్లనే అంటారు


యావర్‌ను ప్రశ్నిస్తూ.. ‘‘నీ బిహేవియర్ ఏమిటీ? కొన్ని వారాలు బాగానే ఉన్నావు. కోపం తగ్గించుకున్నావు. అరుపులు తగ్గించుకున్నావు’’ అన్నారు. ఆ తర్వాత శోభా మీదకు వెళ్లి గొడవ పడుతున్న వీడియోను చూపించారు. ‘‘నీ బిహేవియర్ చూస్తే ఎవరైనా పిచ్చోడనే అనుకుంటారు. బిగ్ బాస్ ప్రాపర్టీ అయిన మిర్చి దండను విసిరేశావు. బిగ్ బాస్ ప్రాపర్టీని అలా చేయొచ్చా. నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూస్తే నేనైనా, ప్రేక్షకుడైనా పిచ్చోడనే అంటారు. తను పిచ్చోడు అంటే పిచ్చోడివి అయిపోతావా? పిచ్చోడిలా యాక్ట్ చేస్తావా’’ అని ప్రశ్నించారు. దీనికి యావర్ ‘‘ఫ్రస్ట్రేషన్‌లో అలా చేశాను’’ అని సమాధానం ఇచ్చాడు. 


యావర్ ‘హిట్లర్’ అన్నాడా?


ఆ తర్వాత హిట్లర్ పదంపై కూడా నాగార్జున ఇద్దరినీ ప్రశ్నించారు. అయితే, ‘హిట్లర్’ అనే పదాన్ని యావర్ నిజంగానే నిన్ను అన్నాడా అని శోభాను అడిగారు. దీనికి శోభా.. ఆ రోజు ‘హిట్లర్’ అనే పదాన్ని అన్నాడని సేఫ్‌గా మాట్లాడే ప్రయత్నం చేసింది. దీంతో నాగార్జున.. అతడు నిజంగానే నిన్ను హిట్లర్ అన్నాడా లేదా అనేది స్పష్టంగా చెప్పాలని, ఒక్క మాటను పట్టుకుని ఊహించుకోవడం కాదని అన్నారు. ఆ తర్వాత వారికి ఆ రోజు జరిగిన వాగ్వాదం వీడియోను చూపించారు. అందులో యావర్ ఆమెను హిట్లర్ అనలేదని తేలిపోయింది. ఆ తర్వాత నాగ్.. ‘‘ఎక్కడో ఉండాల్సిన నీ గేమ్ పడిపోయింది యావర్’’ అంటూ జెండా విరిచారు. రతికాతో యావర్ ఎక్కువ సేపు గడుపుతున్న నేపథ్యంలో.. ‘‘ఆట మీద ఫోకస్ పెట్టు. ఎవరెవరో ఏదేదో అంటారు. అవన్నీ బుర్రలో పెట్టుకోవద్దు’’ అని అన్నారు.


నన్ను నేనే కొట్టుకుంటా: శివాజీ 


నామినేషన్స్ తర్వాత శివాజీ చేసిన వ్యాఖ్యలపై కూడా నాగార్జున మాట్లాడారు. ‘‘జనాలు, మనుషులు అనేవారు ఉంటే ఈ వారం చూస్తా. లేకపోతే ఎవరో ఒకరిని కొట్టి వెళ్లిపోతా’’ అంటూ చేసిన శివాజీ చేసిన కామెంట్స్ వీడియోను నాగ్ ప్రదర్శించారు. దీనిపై శివాజీ స్పందిస్తూ.. ‘‘దాని గురించి మీ ముందు చెప్పలేను’’ అని అన్నారు. ఎవరిని కొట్టి వెళ్లిపోతావు శివాజీ.. అని నాగ్ ప్రశ్నించగా.. ‘‘నేను ఇంకొకరిని కొట్టలేను. నన్ను నేనే కొట్టుకుని వెళ్లిపోతా’’ అన్నారు. ‘‘శివాజీ నువ్వు నీతిగానే ఉంటున్నావని మా నమ్మకం’’ అని నాగ్ అన్నారు. దీనికి సమాధానం ఇస్తూ.. ‘‘నేను నీతిగానే ఉంటున్నా. కానీ హౌస్‌లో కొందరి బిహేవియర్ నచ్చడం లేదు. హౌస్‌లో రకరకాలుగా ఉంటున్నారు. బయట బూతులు తిట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. తమని తాము హీరోలుగా ఫీలవుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే. తిట్టడానికి రైట్ లేదు. ఫ్రస్ట్రేషన్ నాలో నేనే దాచుకుంటున్నా. మీరు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉంటున్నారు’’ అని అన్నాడు.


శివాజీని ‘సోఫా కింగ్’ అనేసిన నాగ్


ఇందుకు నాగ్ స్పందిస్తూ.. ‘‘నెగటివ్ టాక్ వద్దు. పదే పదే హౌస్ నుంచి వెళ్లిపోతా అంటున్నావు. కొన్ని వారాలుగా ఇదే మాట రిపీట్ అవుతోంది. బయట లైఫ్‌లో కూడా ఇలాంటివి ఫేస్ చేస్తాం. ఒక సినిమా చేసేప్పుడు ఎంతోమందితో రియాక్ట్ అవుతాం. ఆ సినిమా కంప్లీట్ చేస్తాం’’ అని అన్నారు. బయట ఎలా ఉంటావో.. ఇక్కడా అలాగే ఉండు. సేఫ్ ఆడోద్దు. ఏమైనా ఉంటే నాకు చెప్పేయ్’’ అని శివాజీకి బూస్ట్ ఇచ్చారు నాగార్జున. ‘‘ఆడియన్స్ గమనించాలనే తపనే నాది. చేయి దాటిపోతే చెప్పేస్తాను’’ నఅి శివాజీ అన్నాడు. అయితే, చెయ్యి బాగాలేకపోయినా బాల్ గేమ్ బాగా ఆడావని నాగ్ ప్రశంసించారు. ఆ తర్వాత నాగార్జున హౌస్‌లో ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిన కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు. ఈ సందర్భంగా శివాజీని.. నాగ్ ‘సోఫా కింగ్’ అనడం గమనార్హం. సోషల్ మీడియాలో చాలామంది శివాజీని ఇదే పేరుతో పిలుస్తున్నారు. ఎప్పుడూ సోఫాలో కూర్చొని కబుర్లు చెబుతున్న నేపథ్యంలో శివాజీకి ఆ పేరు వచ్చింది. ప్రియాంక, గౌతమ్‌లు ఇద్దరు ఈ వారం సేవ్ అయ్యారు.


Also Read: రతిక తీరుపై నాగ్ ఫైర్, సందీప్‌‌ ‘బొంగులో’ డ్యాన్సర్ - అమర్ తిట్లపై ప్రియాంకకు కింగ్ క్లాస్