‘బిగ్ బాస్’ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం అనేది అంత ఈజీగా లభించే అవకాశం కాదు. అయితే, రతికాకు ఆ ఛాన్స్ కొట్టేసింది. పైగా.. అతి తక్కువ ఓట్లతో. మరి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిన రతిక.. ఇంకా గతాన్ని తవ్వుకుంటూ లేజీగా ఆడటం ప్రేక్షకులకే కాదు.. హోస్ట్ నాగార్జునకు కూడా నచ్చలేదు. ఇందుకు శనివారం నాగ్ చేసిన కామెంట్సే నిదర్శనం. 


రెండో ఛాన్స్ అందరికీ రాదు రతిక: నాగ్


హౌస్‌లో రతిక ఆటతీరును చూసి నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రతికా జెండాను విరిచేశారు. ‘‘హౌస్ డెసిషన్ రైట్. నీకు లీస్ట్ ఓట్లు వేశారు. గతాన్ని నెమరు వేసుకోడానికి హౌస్‌కు తిరిగి వెళ్లావా’’ అని నాగ్ ప్రశ్నించారు. దీనిపై రతిక స్పందిస్తూ.. ‘‘కొన్ని పాత విషయాల గురించి మాట్లాడాను. ఈ వారం తప్పకుండా ఆడతాను’’ అని తెలిపింది. ‘‘వచ్చే వారం ఆడతాను అంటున్నావు. ఈ వారం ఏం చేశావు? నామినేషన్స్‌లో లేవనే ధైర్యమా? గతం గురించి మాట్లాడుతూ కూర్చుంటే గతంలోనే ఉండిపోతావు. మనుషుల మీద ఫోకస్ చెయ్యొద్దు. ఈ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయేవారు ఇంకో ఛాన్స్ అడుగుతారు. ఆ ఛాన్స్ నీకు వచ్చింది, కాపాడుకో’’ అని నాగ్ అన్నారు. రతిక హౌస్‌లో అడుగుపెట్టిన రోజు నుంచి శివాజీ బ్యాచ్‌తోనే ఉంటోంది. అలాగే.. యావర్‌కు ఏవేవో చెప్పి, నీ మిత్రులు, శత్రువులు ఎవరో తెలుసుకో అంటూ అతడి ఆటకు స్పీడ్ బ్రేకర్‌గా మారింది. ఇదే విషయాన్ని నాగ్ కూడా యావర్‌తో మాట్లాడినప్పుడు పరోక్షంగా ప్రస్తావించారు.  


బొంగులో డ్యాన్సర్.. సందీప్ ఆడిట్యూడ్‌పై నాగ్ కామెంట్స్


నామినేషన్స్‌లో భాగంగా సందీప్ చేసిన కామెంట్స్‌పై నాగ్ స్పందించారు. ఈ సందర్భంగా సందీప్‌ను బొంగులో డ్యాన్సర్ అన్నారు. ‘‘నువ్వు ఇటీవల డ్యాన్స్ షోలో డ్యాన్సర్‌వా, కొరియోగ్రాఫరా?’’ అని అడిగారు. ఇందుకు సందీప్ ‘‘డ్యాన్స్, కొరియోగ్రఫీ.. రెండూ సార్’’ అని సందీప్ అన్నాడు. ‘‘అంటే డ్యాన్స్ చేశావు కాబట్టి.. డ్యాన్సరే కదా. ఆ మాట చెప్పడానికి బొంగులో ఆటిట్యూడ్ ఏమిటి?’’ అని నాగ్ అన్నారు. ‘‘బొంగులో.. పదం నీ దృష్టిలో బూతు కాదు కదా?’’ అని ఆ రోజు నామినేషన్స్‌లో అన్న మాటపై సెటైర్ వేశారు నాగ్.


అమర్‌కు నాగ్ క్లాస్


నామినేషన్స్ రోజు అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్‌పై చేసిన కామెంట్లపై కూడా నాగ్ స్పందించారు. ‘ఈ నా కొడుకు’ అని ప్రశాంత్‌ను అనడం, ‘పగిలిపోద్ది’ అంటూ కుర్చీని తన్నడంపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రశాంత్ అంటే నీకు చిన్న చూపు. ఆ పదం సందీప్ మీద, అర్జున్ పైన ఎప్పుడైనా వాడావా?’’ అని అమర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రియాంకను లేపి.. ‘‘అమర్ అన్న మాటకు నీ బ్లడ్ బాయిల్ కావడం లేదా? ఎందుకు ఖండించలేదు? ఒకరి విషయంలో ఒకరిలా, మరొకరి విషయంలో మరొకరిలా ఉండొద్దు. నువ్వు రైజ్ చేయకపోతే ప్రియాంక మారిపోయిందని అంటారు’’ అని నాగ్ అన్నారు. ఆ తర్వాత ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘నేను మాట్లాడేప్పుడు ఇలా ఉంటావు. నామినేషన్స్ సమయంలో మారిపోతావేంటీ? ఇదే విషయాన్ని చాలామంది అంటున్నారు’’ అని నాగ్ అన్నారు. బ్లాక్స్ టాస్క్ వేగంగా ఆడినందుకు ప్రశాంత్ జెండాను పాతారు.


Also Read: సోఫా కింగ్ - సేఫ్ ఆడొద్దు, ఎవరిని కొడతావ్? శివాజీపై నాగార్జున కామెంట్స్