మహబూబ్ దిల్ సే (Mehaboob Dil Se) సోషల్ మీడియాలో పాపులర్. అతనొక డ్యాన్సర్. అలాగే ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయన్సర్స్ కూడా! తర్వాత 'బిగ్ బాస్' షోకి వెళ్ళాడు. శ్రీ సత్య మోడలింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి... సీరియల్స్ చేసింది. 'బిగ్ బాస్' షోతో పాటు కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి 'నువ్వే కావాలి' అంటూ సాగే ఒక ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. అదీ భారీ బడ్జెట్‌తో!
ఈఫిల్ టవర్ ముందు 'నువ్వే కావాలి' షూటింగ్!
'నువ్వే కావాలి' వీడియో సాంగ్ ఇటీవల విడుదలైంది. సినిమాల్లో పాటలకు అసలు ఏమాత్రం తీసిపోని రీతిలో భారీగా, అందంగా తీశారని అర్థం అవుతోంది. ఈ సాంగ్ షూట్ కోసం మెహబూబ్, శ్రీ సత్య అండ్ టీమ్ యూరోప్ వెళ్ళింది. పారిస్ వీధుల్లో, ఇంకా అందమైన లొకేషన్లతో పాటు ఈఫిల్ టవర్ ముందు సాంగ్ షూట్ చేశారు.
'నువ్వే కావాలి' పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా... మనీష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణంతో పాటు ఎడిటింగ్, డైరెక్షన్ బాధ్యతలను భార్గవ్ రవడ చూసుకున్నారు. మనీష్ కుమార్, వైషు మాయ సాంగ్ పాడారు.
హైదరాబాద్ సిటీలో జరిగిన కార్యక్రమంలో 'నువ్వే కావాలి' పాటను శుక్రవారం విడుదల చేశారు. అందులో శ్రీ సత్య మాట్లాడుతూ... ''ఈ పాట ఎప్పుడెప్పడు విడుదల అవుతుందా? నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇవాళ సాంగ్ రిలీజ్ ప్రోగ్రాంకి ఇంత మంది రావడం సంతోషంగా ఉంది. మెహబూబ్ దిల్ సేతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటకు నన్ను తీసుకున్న భార్గవ్ గారికి థాంక్స్'' అని చెప్పారు. మహబూబ్ దిల్ సే మాట్లాడుతూ... ''నేను అడిగిన వెంటనే నా కోసం వచ్చిన నా స్నేహితులు సోహెల్, నోయల్, విక్కీ, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, ప్రియాంక.... అందరికీ థాంక్స్. సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు'' అని చెప్పారు.
Also Read: రామ్ చరణ్‌తో ప్రభాస్ హీరోయిన్... పాన్ ఇండియా లెవల్‌లో సుకుమార్ మాస్టర్ ప్లాన్, మామూలుగా లేదుగా
'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు రన్నరప్ గౌతమ్ కృష్ణ, 'బిగ్ బాస్ 3' విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, ఇంకా హీరోలు అర్జున్ కళ్యాణ్, సోహెల్, నోయల్, సింగర్ రోల్ రైడా, బిగ్ బాస్ కంటెస్టెంట్లు - నటీమణులు ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్, 'నువ్వే కావాలి' సాంగ్ క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.