'గేమ్ ఛేంజర్' మూవీ డిజప్పాయింట్ చేయడంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు రామ్ చరణ్. అయితే బుచ్చిబాబు తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో రామ్ చరణ్ (Ram Charan) తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఆర్సీ 17' మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది అన్న క్రేజీ న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 


సుకుమార్ - చెర్రీ మూవీలో హీరోయిన్ ఫిక్స్? 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుండడంతో హీరోయిన్లు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. అందులో భాగంగానే చెర్రీ వరుసగా స్టార్ హీరోయిన్లతో జత కడుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న సుకుమార్ - రామ్ చరణ్ ప్రాజెక్ట్ లో తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది. 'పుష్ప 2' మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. అయితే ఈ సినిమాను సుకుమార్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 


ఇప్పటికే రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సెకండ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 'ఆర్సీ 17' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందునున్న ఈ ప్రాజెక్టును గత ఏడాది హోలీ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సుకుమార్ 'పుష్ప 2' రిలీజై, హిట్ కావడంతో అదే జోష్ తో 'ఆర్సీ 17' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు సుకుమార్. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మేకర్స్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ పేరుని పరిశీలిస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైతే ఇది ఇంకా రూమరే. అయినప్పటికీ రామ్ చరణ్, శ్రద్ధ కపూర్ జోడి అనగానే టాప్ ఆఫ్ ది టౌన్ అయ్యింది ఈ పుకారు. 


Also Read'స్కై ఫోర్స్' రివ్యూ: దేశభక్తి సినిమా అక్షయ్‌ కుమార్‌కు హిట్ ఇచ్చిందా? లేదంటే ఇదీ ఫ్లాపుల పరంపరలో చేరుతుందా?


బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ 
ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇటీవల కాలంలో వరసగా బాలీవుడ్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో మొదలుపెట్టారు చెర్రీ ఈ ట్రెండ్ ను. అందులో సీతగా రామ్ చరణ్ కి జోడిగా అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటించిన కియారా అద్వానీ కూడా బీ టౌన్ బ్యూటీనే. ఇక ఇప్పుడు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్టులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో కూడా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరే వినిపిస్తుండటం విశేషం. కానీ 'ఆర్సీ 17' మూవీలో హీరోయిన్ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే శ్రద్ధా కపూర్ ఇప్పటికే ప్రభాస్ తో కలిసి 'సాహో' మూవీలో నటించింది. 


Read Also: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్‌, SSMB29 షూటింగ్ షురూ