Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode హాస్పిటల్‌ బెడ్ మీద శౌర్య కనిపించదు. కార్తీక్ వచ్చి నర్సుల మీద అరుస్తాడు. ఇంతలో డాక్టర్ వచ్చి పాప ఇక్కడే ఉంటుంది అందరం చూద్దామని కార్తీక్‌కి నచ్చచెప్తాడు. కార్తీక్ డాక్టర్ మీద కూడా కేకలు వేస్తాడు. పాపకి ఏమైనా అయితే ఊరుకోనని అంటాడు. రేపు ఆపరేషన్ పెట్టుకొని ఈ రోజు పాప కనిపించకపోతే ఎలా డాక్టర్ అని బయటకు వెళ్లి శౌర్య కోసం వెతుకుతాడు. 


ఇంతలో శౌర్య హాస్పిటల్ ఆవరణలో ఉన్న వినాయకుడి దగ్గర ఉంటుంది. కార్తీక్ చూసి ఊపిరి పీల్చుకొని పాప దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఏమైంది నాన్న అని పాప అడిగితే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. భయం వేసిందని పక్కన ఎవరూ లేరని అందుకే దేవుడి దగ్గరకు వచ్చానని చెప్తుంది. తనకు రేపు పెద్ద పరీక్ష చేస్తారని ఏం భయపడొద్దని డాక్టర్ చెప్పారని స్కూల్‌లో పరీక్షలు అయితే అమ్మ దేవుడికి దండం పెట్టుకో మని చెప్పేదని రేపు పెద్ద పరీక్ష కదా అందులో ఫెయిల్ అవ్వకూడదని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చానని అంటుంది. పాప మాటలకు కార్తీక్ ఏడుస్తాడు. నువ్వు కచ్చితంగా పాస్ అవుతావమ్మా అందరం హ్యాపీగా ఉంటాం అని అంటాడు. దానికి పాప అమ్మని ఒకసారి చూపించు నాన్న అంటే మనం ముందు అనుకున్నట్లు తర్వాత అమ్మకి సర్‌ఫ్రైజ్ చేద్దామని అంటాడు. కార్తీక్ మనసులో రేపే ఆపరేషన్ డబ్బులు కోసం ఏం చేయాలో అని అనుకుంటాడు. దేవుడికి దండం పెట్టుకొని ఎలా అయినా ఒక్క హోప్ ఇవ్వు దేవుడా అని దండం పెట్టుకుంటాడు.


ఇక జ్యోత్స్న దాసుని చంపాలని ప్రయత్నించిన సంఘటన గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. దాసు లేస్తే తన పరిస్థితి ఏంటా అనుకుంటుంది. ఇంతలో దశరథ్ వచ్చి జ్యోత్స్న ఏం ఆలోచిస్తుంది దాసు గురించేనా దాసుని మళ్లీ చంపేయాలి అని అనుకుంటుందా అని అనుకుంటాడు. ఇంతలో కాంచన ఇంటికి వస్తుంది. జ్యోత్స్న, దశరథ్ చాలా సంతోషిస్తారు. అనసూయ కూడా వస్తుంది. సుమిత్ర వచ్చి ఎమోషనల్ అవుతుంది. ఇక ఈ ఇంటి ఆడబిడ్డ ఇలా పేదదానిలా ఉండటం ఏంటి అని అంటారు. సాయం కోసం వచ్చానని కాంచన అంటుంది. నాన్న ఎక్కడ అంటే శివనారాయణ వచ్చి ఎవరమ్మా నువ్వు ఇది వరకు మనం ఎక్కడైనా కలిశామా అని మాట్లాడుతాడు.


శివనారాయణ: నన్ను కాదని వెళ్లిపోయావ్. వెళ్లేముందు ఒక సారి ఆలోచించు అమ్మా అంటే నా కొడుకు మాటే నా మాట అన్నావ్. మెడలో తాళికి కూడా రేటు కట్టావ్. ఆ మాట వింటుంటే నన్ను కొలిమిలో కాల్చిన కత్తె గుండెలో దించినట్లు అయిందమ్మా. నీ కొడుకుకి బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది. పెళ్లాం కోసం వాడు పోతే కోడలి కోసం నువ్వు పోయావ్. ఇన్నాళ్లు నీకు మేం గుర్తు లేం ఇప్పుడు వచ్చామా. అసలు కార్తీక్ తల్లి గారు మా గుమ్మం ఎందుకు తొక్కారు.
కాంచన: నాకు నీ సాయం కావాలి నాన్న.
సుమిత్ర: పెద్దగా నవ్విన మామతో మామయ్య గారు అలా నవ్వుతారేంటి సాయం కోసం వచ్చిన కూతుర్ని చూసి. 
శివనారాయణ: సవాలు చేసిన కార్తీక్ గుర్తొచ్చాడమ్మా. 
కాంచన: నువ్వు ఎలా అయినా అనుకో నాన్న కావాలి అంటే నేను ఓడిపోయాను అనుకో కానీ. 
జ్యోత్స్న: అత్త మన ఇంటికి వచ్చింది అంటే మనం ఉన్నాం అనే కదా మన సాయం కోరే వచ్చింది కదా చెప్పు అత్త నువ్వు.
కాంచన: నాన్న నాకు డబ్బులు కావాలి నాన్న 45 లక్షలు కావాలి.
శివనారాయణ: అంటే నీ కొడుకుని గెలిపించడానికి పెట్టుడి అడుగుతున్నావా.
కాంచన: నేను డబ్బు అడిగింది నా కొడుకు కోసం కాదు
అనసూయ: మీరు  అలా ఏడుస్తుంటే ఎలా తెలుస్తుంది అమ్మ విషయం చెప్పండి.
శివనారాయణ: ఇవి అవసరానికి వచ్చిన కన్నీరే.
కాంచన: నాన్న డబ్బు నా కోసమో నా కొడుకు వ్యాపారం కోసమో కాదు నాన్న నా మనవరాలి కోసం శౌర్యకి ఆరోగ్యం బాలేదు నాన్న హాస్పిటల్‌లో చేర్పించాం. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చింది. ఆపరేషన్ చేయకపోతే అది బతకదు అన్నయ్య. పెద్దగా టైం కూడా లేదు కార్తీక్ డబ్బు కోసం తిరుగుతున్నాడు. 45 లక్షలు అంటే ఎవరు ఇస్తారు. వాడి బాధ చూసి పాపని కాపాడుకోవడానిక వేరే దారిలేక మీ దగ్గరకు వచ్చాను.  
శివనారాయణ: ఏంటి చంటి దానికి అంత బాలేదా.
జ్యోత్స్న: తాత నువ్వు అత్త మాటలు నమ్ముతున్నావా. 


పాపకి బాలేకోతే దీప రావాలి కానీ అత్త వచ్చింది అని జ్యోత్స్న ఇదంతా నాటకం అని అంటుంది. జ్యోత్స్న మాట్లాడుతుంటే దశరథ్ జ్యోత్స్నిని తిడతాడు. సుమిత్ర కూడా తిడుతుంది. పనికి మాలిన దీప కోసం అత్త వచ్చిందని జ్యోత్స్న అంటే దశరథ్ కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఇక శివనారాయణ మీ చెల్లి మాటల మీద నాకు అనుమానంగా ఉందని అంటాడు. అనసూయ వాళ్లతో కూతురిని ఇలా అవమానించడం తప్పు అని అంటుంది. కాంచన చేతులు చాచి సాయం చేయమని అడుగుతుంది. నీ కొడుకుకి పుట్టలేదు కదా అది నీకు మనవరాలు ఏంటి అని శివనారాయణ అంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!